రెండో షెడ్యూల్ కు అంతా రెడీ

రాజమౌళి రెండో షెడ్యూల్ కు పెద్దగా గ్యాప్ ఇవ్వలేదు. ఆర్-ఆర్-ఆర్ మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన కొన్ని రోజులకే సెకెండ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. అవును.. ఈనెల 21 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలుకాబోతోంది. ఏకంగా నెల రోజుల పాటు ఏకథాటిగా జరగనుంది.

ఫస్ట్ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ తీశాడు రాజమౌళి. దానికి పెద్దగా మేకోవర్స్ అవసరం రాలేదు. కానీ రెండో షెడ్యూల్ టైమ్ కు మాత్రం ఎన్టీఆర్ కాస్త లావుగా కనిపించాలి. ఈ మేరకు జక్కన్న కోరుకున్న వెయిట్ ను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. బొద్దుగా తయారయ్యాడు. నిజానికి సెకెండ్ షెడ్యూల్ కు ఈ గ్యాప్ ఇవ్వడానికి కారణం కూడా ఇదే.

రామ్ చరణ్ క్యారెక్టర్ లో మాత్రం ఎలాంటి మేకోవర్స్ ఉండవు. ఓ సాధారణ కుర్రాడి పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడు. సెకెండ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా టైటిల్ ను, హీరోయిన్స్ ను ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. డీవీవీ ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాడు ఈ మ్యూజిక్ డైరక్టర్.