పెళ్లి చేసుకోబోతున్న రిచా

ప్రభాస్ సరసన “మిర్చి” సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది రిచా గంగోపాధ్యాయ. ఇక ఆ తరువాత రవితేజ తో “సారోచ్చారు” , తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి ప్లేస్ లో నిలిచింది రిచా గంగోపాధ్యాయ.

కానీ కెరీర్ పీక్ స్టేజి లో ఉండగా సినిమా ఇండస్ట్రీ ను వదిలేసి ఫారిన్ వెళ్లి అక్కడ తన చదువుని కొనసాగించింది ఈ భామ. ఇక ఇప్పుడు ఈ భామకి అక్కడే తను ప్రేమించిన అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంది.

రెండేళ్లుగా తాను ప్రేమిస్తున్న జోయ్ అనే వ్యక్తితో తనకు నిశ్చితార్థం జరిగిందని రిచా గంగోపాధ్యాయ తెలిపింది. తాను చదువుకున్న బిజినెస్ స్కూలులో రెండేళ్ల క్రితం జోయ్ తో తనకు పరిచయం ఏర్పడిందని రిచా పేర్కొంది. పెళ్లి తేదీ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసింది రిచా గంగోపాధ్యాయ.