Telugu Global
Cinema & Entertainment

2020 సంక్రాంతికి రానున్న "బంగార్రాజు"

అక్కినేని నాగార్జున కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా “సోగ్గాడే చిన్ని నాయన”. ఈ సినిమాలో బంగార్రాజు అనే పాత్రలో నటించాడు నాగార్జున. కళ్యాణ్ క్రిష్ణ కురసాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2016 సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా “బంగార్రాజు” అనే కథని రాసుకున్నాడు. ఈ కథ నాగార్జునకి బాగా నచ్చిందట. కానీ నాగార్జున ఇతర ప్రాజెక్ట్స్ లో […]

2020 సంక్రాంతికి రానున్న బంగార్రాజు
X

అక్కినేని నాగార్జున కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా “సోగ్గాడే చిన్ని నాయన”. ఈ సినిమాలో బంగార్రాజు అనే పాత్రలో నటించాడు నాగార్జున.

కళ్యాణ్ క్రిష్ణ కురసాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2016 సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా “బంగార్రాజు” అనే కథని రాసుకున్నాడు. ఈ కథ నాగార్జునకి బాగా నచ్చిందట. కానీ నాగార్జున ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు.

అయితే ఈ సినిమాపై అధికారికంగా ఒక విషయాన్ని బయటపెట్టారు మూవీ యూనిట్. “వచ్చే ఏడాది ఈ సమయానికి బంగార్రాజు మీ అభిమాన థియేటర్స్ లో..!!!” అని వార్తను ట్వీట్ చేశారు చిత్ర యూనిట్.

అంటే వచ్చే ఏడాది అనగా 2020 లో సంక్రాంతి కానుకగా ‘బంగార్రాజు’ గా మళ్ళీ రానున్నాడు. అక్కినేని నాగార్జునని మళ్ళీ మాస్ పాత్రలో చూసే అవకాశం అక్కినేని అభిమానులకి దక్కనుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నాడు.

First Published:  16 Jan 2019 6:42 AM GMT
Next Story