Telugu Global
Cinema & Entertainment

అఖిల్ కోసం ఎన్టీఆర్ ప్రచారం

ఒక హీరో సినిమాకు మరో హీరో ప్రచారం చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అఖిల్ సినిమా కోసం కూడా ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నాడు. మిస్టర్ మజ్ను ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నాడు. శనివారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ ఫంక్షన్ పెడుతున్నారు. ఆ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నాడు. ఈవెంట్ కు ఎలాగూ నాగార్జున, నాగచైతన్య, సమంత, సుమంత్, […]

అఖిల్ కోసం ఎన్టీఆర్ ప్రచారం
X

ఒక హీరో సినిమాకు మరో హీరో ప్రచారం చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అఖిల్ సినిమా కోసం కూడా ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నాడు. మిస్టర్ మజ్ను ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నాడు.

శనివారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ ఫంక్షన్ పెడుతున్నారు. ఆ ఫంక్షన్ కు ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నాడు. ఈవెంట్ కు ఎలాగూ నాగార్జున, నాగచైతన్య, సమంత, సుమంత్, సుశాంత్, అఖిల్-నిధి అగర్వాల్ వస్తారు కాబట్టి.. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కలర్ ఫుల్ గా ఉండబోతోంది.

జనవరి 25న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ముగిసిన వెంటనే సెన్సార్ ఫార్మాలిటీస్ మొదలుపెట్టి, డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ మొదలుపెడతారు. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు.

First Published:  17 Jan 2019 6:43 AM GMT
Next Story