వరుణ్ తేజ్ సినిమాలో అర్జున్

ప్రస్తుతం ఎఫ్2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. మీడియాకు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ మూవీ హంగామా ముగిసిన వెంటనే బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న తన కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడు. ఈ మేరకు బాక్సింగ్ నేర్చుకునేందుకు విదేశాలకు కూడా వెళ్లబోతున్నాడు వరుణ్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ను కూడా తీసుకున్నారు.

సినిమాలో వరుణ్ తేజ్ కు కోచ్ గా అర్జున్ నటించబోతున్నాడు. ఇతడు గతంలో తెలుగులో నా పేరు సూర్య సినిమాలో నటించాడు. సైకాలజిస్ట్ గా, బన్నీ తండ్రిగా ఆ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన అర్జున్.. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలో మరో కీలక పాత్రలో మెరవబోతున్నాడు.

ఈ ప్రాజెక్టుతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇంతకుముందు ఇతడు శ్రీనువైట్ల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. వరుణ్ తేజ్ నటించిన మిస్టర్, తొలిప్రేమ సినిమాలకు కూడా డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో నటించాడు. అల్లు అరవింద్ కొడుకు అల్లు బాబీ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు.