Telugu Global
NEWS

తీన్మార్ వన్డే సిరీస్ లో ఆఖరిపోరాటం

మెల్బోర్న్ వేదికగా రేపే డూ ఆర్ డై ఫైట్ ఆఖరి వన్డేలో నెగ్గిన జట్టుకే సిరీస్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మ్యాచ్ ఆస్ట్రేలియాలో 64 రోజుల టీమిండియా పర్యటన ముగింపు దశకు చేరింది. తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరి వన్డేకి…ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మెల్బోర్న్ వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండటంతో… రెండుజట్లూ డూ ఆర్ డై ఫైట్ […]

తీన్మార్ వన్డే సిరీస్ లో ఆఖరిపోరాటం
X
  • మెల్బోర్న్ వేదికగా రేపే డూ ఆర్ డై ఫైట్
  • ఆఖరి వన్డేలో నెగ్గిన జట్టుకే సిరీస్
  • శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మ్యాచ్

ఆస్ట్రేలియాలో 64 రోజుల టీమిండియా పర్యటన ముగింపు దశకు చేరింది. తీన్మార్ వన్డే సిరీస్ లోని ఆఖరి వన్డేకి…ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మెల్బోర్న్ వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండటంతో… రెండుజట్లూ డూ ఆర్ డై ఫైట్ కు సిద్ధమయ్యాయి. ఈ పోటీ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.

క్లయ్ మాక్స్ దశలో…..

కంగారూ ల్యాండ్ లో…టీమిండియా 64 రోజుల జైత్రయాత్ర ముగింపు దశకు చేరింది. తీన్మార్ టీ-20 సిరీస్ ను 1-1తో డ్రాగా ముగించి…. నాలుగుమ్యా చ్ ల టెస్ట్ సిరీస్ ను 2-1తో నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిన టీమిండియా….తీన్మార్ వన్డే సిరీస్ నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉంది.

నీకోటి… నాకోటి….

వన్డే సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో ఆతిథ్య ఆస్ట్రేలియా, టీమిండియాజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో…. ఆఖరి వన్డే నిర్ణయాత్మకంగా మారింది.

సిడ్నీ వేదికగా జరిగిన తొలివన్డేలో ఆస్ట్రేలియా 34 పరుగుల విజయంతో 1-0 ఆధిక్యం సాధిస్తే… అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో నెగ్గి 1-1తో సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలిగింది.

టగ్-ఆఫ్- వార్….

దీంతో…శుక్రవారం జరిగే ఆఖరి వన్డేలో నెగ్గిన జట్టుకే సిరీస్ సొంతమయ్యే అవకాశాలు ఉండడంతో….రెండుజట్లూ ఆరునూరైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఆఖరిపోరాటానికి సై అంటున్నాయి.

వన్డే క్రికెట్లో రెండో ర్యాంకర్ టీమిండియా, 6వ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్ల మధ్య…. అదీ ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ వేదికగా జరిగే ఈ ఆఖరాట కోసం… కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు…. ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

కెప్టెన్ విరాట్ కొహ్లీ సెంచరీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అజేయ హాఫ్ సెంచరీలతో పుంజుకొన్న టీమిండియా…సిరీస్ విజయమే లక్ష్యంగా పోటీకి సిద్ధమయ్యింది.

సిరాజ్ స్థానంలో విజయ్ శంకర్…

అడిలైడ్ వన్డే ద్వారా…వన్డే అరంగేట్రం చేసిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ .. ధారాళంగా పరుగులివ్వడంతో….. అతనిస్థానంలో… ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను తుదిజట్టులో చేర్చుకొనే అవకాశాలు లేకపోలేదని …కెప్టెన్ విరాట్ కొహ్లీ ఇప్పటికే పరోక్షంగా తెలపడంతో…ఆఖరి వన్డేలో పాల్గొనే తుదిజట్టులో మార్పు ఖాయమని తేలిపోయింది.

పదునైన కంగారూ బౌలింగ్ ఎటాక్…పవర్ ఫుల్ టీమిండియా బ్యాటింగ్ లైనప్ ల నడుమ మరోసారి… అసలు సిసలు పోరాటం జరుగనుంది.

బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కు అనువుగా ఉండే మెల్బోర్న్ వికెట్ పైన సైతం టాస్ కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు మరోసారి ముందుగా బ్యాటింగ్ కే మొగ్గు చూపే అవకాశాలున్నాయి.

సిడ్నీ వన్డేలో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్న ఆస్ట్రేలియా విజేతగా నిలిచినా… అడిలైడ్ వన్డే లో మాత్రం…చేజింగ్ కు దిగిన టీమిండియా మ్యాచ్ విన్నర్ గా నిలిచింది.

కొహ్లీ వైపే అందరి చూపు…

చేజింగ్ కింగ్ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా మాత్రం…టాస్ ఫలితంతో సంబంధం లేకుండా మ్యాచ్ నెగ్గితీరాలన్న కసితో ఉంది.

వన్డే సిరీస్ ను సైతం నెగ్గడం ద్వారా…64 రోజుల ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించడం ద్వారా…న్యూజిలాండ్ లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో విరాట్ సేన ఉంది.

First Published:  17 Jan 2019 6:30 AM GMT
Next Story