Telugu Global
NEWS

టాప్ గేర్ లో టీమిండియా.... రివర్స్ గేర్ లో ఆసీస్...

కంగారూ గడ్డపై టీమిండియా వన్డేల హాఫ్ సెంచరీ పూర్తి 50 వన్డేల్లో 12 విజయాల టీమిండియా వన్డే క్రికెట్లో రెండోర్యాంకర్ టీమిండియా ప్రత్యర్థిగా …6వ ర్యాంకర్ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. 2019 తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండు వన్డేల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఆఖరివన్డే కు ముందు…రెండుజట్లూ 50 వన్డేల్లో ఢీ కొన్నాయి. మెల్బోర్న్ లో బిగ్ ఫైట్…. వన్డే క్రికెట్లో..కంగారూ […]

టాప్ గేర్ లో టీమిండియా.... రివర్స్ గేర్ లో ఆసీస్...
X
  • కంగారూ గడ్డపై టీమిండియా వన్డేల హాఫ్ సెంచరీ పూర్తి
  • 50 వన్డేల్లో 12 విజయాల టీమిండియా

వన్డే క్రికెట్లో రెండోర్యాంకర్ టీమిండియా ప్రత్యర్థిగా …6వ ర్యాంకర్ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. 2019 తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండు వన్డేల్లో రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలిచాయి. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఆఖరివన్డే కు ముందు…రెండుజట్లూ 50 వన్డేల్లో ఢీ కొన్నాయి.

మెల్బోర్న్ లో బిగ్ ఫైట్….

వన్డే క్రికెట్లో..కంగారూ గడ్డపై ….ప్రపంచ రెండో ర్యాంకర్ టీమిండియా జయాపజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 2019 వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆసీస్ తో ఆడుతున్న తీన్మార్ సిరీస్ లోని తొలివన్డేలో కంగుతిన్న టీమిండియా…రెండో వన్డే విజయంతో సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకొంది.

టీమిండియా రికార్డు బ్యాడ్….

వన్డే క్రికెట్లో…అదీ కంగారూ గడ్డపై ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా ఆడిన సిరీస్ లు, వన్డేల్లో టీమిండియా రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో ఆస్ట్రేలియా ఆధిక్యం కొనసాగుతూనే ఉంది.

వన్డే క్రికెట్లో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం…టీమిండియా రెండో ర్యాంకులో ఉంటే…ఆస్ట్రేలియా ఆరో ర్యాంకులో కొనసాగుతోంది. అంతేకాదు..ఆస్ట్రేలియాకు మూడుసార్లు ప్రపంచకప్ నెగ్గిన రికార్డు ఉంటే…. టీమిండియా రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచింది.

50 వన్డేల్లో 36 పరాజయాలు….

కంగారూ గడ్డపై ప్రస్తుత అడిలైడ్ ఓవల్ వన్డేతో కలుపుకొని.. 50 మ్యాచ్ లు ఆడిన టీమిండియాకు..36 పరాజయాలు. ఫలితం తేలని మరో రెండుమ్యాచ్ ల రికార్డు సైతం ఉంది.

వన్డే క్రికెట్లో…ఓవరాల్ గా ఆసీస్ తో టీమిండియా…మొత్తం 130 వన్డేల్లో ఢీ కొని… 46 విజయాల రికార్డుతో ఉంది. ఆస్ట్రేలియా చేతిలో 75 పరాజయాలు ఉన్నాయి. ఫలితం తేలని మరో 10 వన్డేల రికార్డు సైతం ఉంది.

టీమిండియాను ఊరిస్తున్న ఐదోసిరీస్…

ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకూ…తొమ్మిది ద్వైపాక్షిక సిరీస్ ల్లో తలపడిన భారత్…4 సిరీస్ ల్లో నెగ్గి… ఐదు సిరీస్ ల్లో పరాజయాలు చవిచూసింది.

దైపాక్షిక సిరీస్ ల్లో భాగంగా …ప్రస్తుత అడిలైడ్ వన్డే వరకూ ఈ రెండుజట్లూ 48 వన్డే ల్లో తలపడితే…టీమిండియా 19 గెలుపు, 24 ఓటమి, ఫలితం తేలని 5 వన్డేల రికార్డు ఉంది.

2015-16 ద్వైపాక్షిక సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో ఇదే తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ కావడం విశేషం. 2015-16 సిరీస్ లో 4-1తో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది.

ప్రస్తుత తీన్మార్ సిరీస్ లోని తొలివన్డే లో సైతం… 34 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా…ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. 1-0తో సిరీస్ లో పైచేయి సాధించింది.

అయితే…అడిలైడ్ ఓవల్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో వన్డేలో … టీమిండియా 6 వికెట్ల విజయంతో…సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలిగింది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా….శుక్రవారం జరిగే ఆఖరి వన్డేలో నెగ్గినజట్టే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండటంతో… రెండుజట్లూ…. విజయమే లక్ష్యంగా… ఆఖరిపోరాటానికి సై అంటున్నాయి.

మెల్బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో నెగ్గిన టీమిండియా…అదే వేదికలో జరుగనున్న వన్డేలో సైతం విజయంతో ఆస్ట్రేలియా టూర్ ను ముగించాలన్న పట్టుదలతో ఉంది.

First Published:  17 Jan 2019 11:40 AM GMT
Next Story