షూటింగ్ కి రెడీ అవుతున్న నితిన్

నితిన్ కెరీర్ లో లాస్ట్ హిట్ “అ. ఆ”…ఆ తరువాత నితిన్ హీరోగా నటించిన “లై” “చల్ మోహన్ రంగ” బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్స్ గా నిలిచాయి.

ఇక ఈ రెండు ప్లాప్స్ తరువాత ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన “శ్రీనివాస కల్యాణం” సినిమా కూడా నితిన్ కి సక్సెస్ ను ఇవ్వలేకపోయింది.

ఇక ప్రస్తుతం ఈ ప్లాప్ హీరో ‘చలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ‘భీష్మ’ అనే టైటిల్ తో మన ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ‘సింగల్ ఫరెవర్’ అనే ఆసక్తికరమైన ఉపశీర్షికను పెట్టారు.

రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా…. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. వెంకీ కుడుముల ఈ సినిమాని కూడా “ఛలో” తరహాలో కామెడీ ప్రాధాన్యంగా తెరకెక్కిస్తున్నాడట.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగ వంశీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్లాప్స్ తో కొట్టు మిట్టాడుతున్న నితిన్ కి ఈ సినిమా అయినా సక్సెస్ ని ఇస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా తరువాత సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు నితిన్.