ఏడాది పాటు హీరోల డేట్స్ తీసుకున్న జక్కన్న

“బాహుబలి” లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కి రెడీ  అవుతోంది. ఈ నెల 21 నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇక ఈ “ఆర్.ఆర్.ఆర్” కోసం 10 నెలలు డేట్స్ ని ఇద్దరు హీరోలు కేటాయించినట్లు సమాచారం.

అయితే ఈ పది నెలలు కేవలం షూటింగ్ మాత్రమే ఉంటుందట, ఆ తరువాత మరో రెండు నెలలు డబ్బింగ్ వర్క్ ఇంకా మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. అయితే పది నెలల్లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మరొక సినిమాను మొదలు పెట్టడానికి లేదు.

రాజమౌళి సినిమా ఒక కొలిక్కి వచ్చాకే వీరిద్దరికి మరొక సినిమా మొదలు పెట్టే అవకాశం ఉంది. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. 2020 లో ఈ సినిమా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది.