ఆ సినిమా వదిలేసి కొత్త సినిమా పట్టిన రవితేజ

మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ కి ఇప్పుడొక గట్టి హిట్ అవసరం. అందుకే ఈ సారి పెద్ద డైరెక్టర్స్ ని నమ్ముకోకుండా… ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా నిలదొక్కుకుంటున్న వి.ఐ ఆనంద్ కి అవకాశం ఇచ్చాడు రవితేజ.

“డిస్కో రాజా ” గా టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ని ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. కానీ రవితేజ కి ఇంకా కథ విషయం లో క్లారిటీ లేకపోవడం వల్ల సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే గ్యాప్ లో వేరే సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామని రవితేజ భావిస్తున్నాడట.

రవితేజ ఎప్పటి నుంచో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇక ఈ గ్యాప్ దొరికింది కాబట్టి సంతోష్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట.

తమిళ సినిమా “తెరి” కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు.

ఒకవేళ ఈ గ్యాప్ లో ఆనంద్ సినిమా కథ ఫిక్స్ అయితే ఆ సినిమా కూడా స్టార్ట్ చేస్తాడట రవితేజ. మొత్తానికి రెండు సినిమాల షూటింగ్ తో బిజీ అయి త్వరలో బాక్స్ ఆఫీస్ బరిలో దిగడానికి రెడీ అవుతాడు రవితేజ.