సావిత్రి కుటుంబానికి…. “ఎన్టీఆర్” బయోపిక్ లో ఆ సన్నివేశాలు నచ్చలేదట

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా “ఎన్టీఆర్ – కథానాయకుడు”. క్రిష్ డైరెక్ట్ చేశాడు.

బయోపిక్ లో ఎన్టీఆర్ మంచితనాన్ని మాత్రమే చూపించి…. ఆయన్ని హీరోగా మాత్రమే చూపించే ప్రయత్నం చేశారని, ఆయన లైఫ్ లో కొన్ని నెగెటివ్ షేడ్స్ కూడా ఉన్నాయని….. అవి చూపించే ప్రయత్నం అస్సలు చేయలేదని అంటున్నారు సావిత్రి కుటుంబ సభ్యులు.

ఈ సినిమాలో సావిత్రి పాత్రను కించపరిచే విధంగా చూపించారని సావిత్రి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సావిత్రి డబ్బు దుబారా చేయడం గురించి ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ లు ఆమెకు క్లాస్ పీకుతారు. సావిత్రి పాత్రను నెగిటివ్ గా చూపించటం బాగోలేదని అంటున్నారు.

ఎన్టీఆర్ పాత్రను మాత్రం దేవుడు అన్నట్లుగా చూపించి సావిత్రిలో మాత్రం లోపాలను చూపిస్తున్నారని మండి పడుతున్నారు సావిత్రి సన్నిహితులు.

అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ లు అసలెందుకు ఫారిన్ కి వెళ్లారు? అసలు వాళ్ళు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఉన్న చెడు అలవాట్లు ఏంటి? అనేవి కూడా చూపించి ఉంటే బాగుండేదని అంటున్నారు.