Telugu Global
National

డ్యాన్స్ బార్లకు సుప్రీం కోర్టు అనుమతి

ముంబైలో డ్యాన్స్ బార్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. బార్లపై ఉన్న నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసింది. డ్యాన్స్ బార్లకు అనుమతి ఇచ్చింది. డ్యాన్స్ బార్లు, ఆర్కేస్ట్రాపై నిషేధాన్ని సుప్రీం సమర్ధించలేదు. వీటిని అదుపు చేయడం సరైనదే గానీ…. నిషేధించడం మాత్రం సరికాదని అభిప్రాయపడింది. మహిళల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయంటూ గతంలో మహారాష్ట్ర సర్కార్‌ డ్యాన్స్ బార్లపై నిషేధం విధించింది. గతంలో సుప్రీం కోర్టు కూడా నిషేధాన్ని సమర్ధించింది. దీనిపై డ్యాన్స్ బార్ల యజమానులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో […]

డ్యాన్స్ బార్లకు సుప్రీం కోర్టు అనుమతి
X

ముంబైలో డ్యాన్స్ బార్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. బార్లపై ఉన్న నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసింది. డ్యాన్స్ బార్లకు అనుమతి ఇచ్చింది. డ్యాన్స్ బార్లు, ఆర్కేస్ట్రాపై నిషేధాన్ని సుప్రీం సమర్ధించలేదు. వీటిని అదుపు చేయడం సరైనదే గానీ…. నిషేధించడం మాత్రం సరికాదని అభిప్రాయపడింది.

మహిళల ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయంటూ గతంలో మహారాష్ట్ర సర్కార్‌ డ్యాన్స్ బార్లపై నిషేధం విధించింది. గతంలో సుప్రీం కోర్టు కూడా నిషేధాన్ని సమర్ధించింది. దీనిపై డ్యాన్స్ బార్ల యజమానులు న్యాయపోరాటం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీం డ్యాన్స్ బార్లకు అనుమతి ఇస్తూ తీర్పు తెచ్చింది. డ్యాన్సర్లపై డబ్బులు వెదజల్లడాన్ని ఏ మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేసింది.

డ్యాన్స్ బార్ల లోపల సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కూడా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఇలా లోపల సీసీ కెమెరాల ఏర్పాటు ప్రైవసీని దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది.

First Published:  17 Jan 2019 6:20 AM GMT
Next Story