టైటిల్ చేంజ్…. సెంటిమెంటే కారణమా?

“గురు” లాంటి సినిమా తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకొని విక్టరీ వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ మూవీ “ఎఫ్ 2”. వరుణ్ తేజ్ మరో హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాలో వెంకీ ని చాలా కాలం తరువాత కామెడీ రోల్ లో చూపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా తరువాత వెంకటేష్ నాగ చైతన్య తో కలిసి “వెంకీ మామ” అనే సినిమాలో నటిస్తున్నాడు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో జులై లో స్టార్ట్ అవ్వాలి. కానీ సురేష్ బాబు కథలో కొన్ని మార్పులు చెప్పడం వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ని చేంజ్ చేయాలని సురేష్ బాబు డిసైడ్ అయ్యాడట. దీనికి కారణం హీరోల పేర్లు టైటిల్ గా పెట్టిన సినిమాలేవి సక్సెస్ కాలేదని సెంటిమెంట్ అట. ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకొనే సురేష్ బాబు డైరెక్టర్ బాబీ తో టైటిల్ చేంజ్ చేయమని చెప్పాడట.

ఇప్పటికే కథలో మార్పులంటూ సురేష్ బాబు సూచించడం… ఇప్పుడు ఏకంగా టైటిలే మార్పు చేయమని చెప్పడంతో…. బాబీ ఈ ప్రాజెక్టులో కంటిన్యూ అవుతాడా?లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.