వచ్చే నెల 14న జగన్‌ గృహప్రవేశం

వైఎస్ జగన్‌ నేడు లండన్ వెళ్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన నేడు ఉదయం లండన్‌ బయలుదేరుతారు. ఐదు రోజలు పాటు లండన్‌లో పర్యటిస్తున్నారు. జగన్‌ కుమార్తె వర్ష… లండన్ లోనే చదువుతున్నారు.

ప్రతిష్టాత్మక లండన్ స్కూల్‌ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సంపాదించిన వర్ష అక్కడే చదువుకుంటున్నారు. ప్రజా సంకల్ప యాత్ర వల్ల ఏడాది కాలంగా జగన్‌ బిజీగా ఉన్నారు. పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో కుమార్తెను చూసేందుకు కుటుంబ సభ్యులతో పాటు లండన్ వెళ్తున్నారు.

మరోవైపు ఏపీ రాజధాని పరిధిలో జగన్ కొత్త ఇంటి నిర్మాణం దాదాపు పూర్తయింది. తాడేపల్లిలో ఈ ఇంటిని నిర్మించారు. పార్టీ కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేశారు. వచ్చే నెల 14న జగన్‌ తాడేపల్లిలో నిర్మించిన సొంతింటిలోకి గృహప్రవేశం చేయనున్నారు.