Telugu Global
Cinema & Entertainment

వెబ్ సిరీస్ కు ఇంత రెమ్యూనరేషనా?

“బాహుబలి” సినిమా ద్వారా ప్రభాస్, అనుష్క లకి ఎంత పేరు వచ్చిందో, ఆ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన రమ్యక్రిష్ణ కి కూడా అంతే పేరొచ్చింది. “బాహుబలి” లో శివగామి గా తన అద్భుతమైన నటనని ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకుంది రమ్య క్రిష్ణ. ఈ సినిమా తరువాత రమ్యక్రిష్ణ తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసింది. ఇక “బాహుబలి” తరువాత తెలుగు లో ఆమె నటించిన సినిమా “శైలజా రెడ్డి అల్లుడు”. ఈ సినిమాలో రమ్యక్రిష్ణ […]

వెబ్ సిరీస్ కు ఇంత రెమ్యూనరేషనా?
X

“బాహుబలి” సినిమా ద్వారా ప్రభాస్, అనుష్క లకి ఎంత పేరు వచ్చిందో, ఆ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన రమ్యక్రిష్ణ కి కూడా అంతే పేరొచ్చింది. “బాహుబలి” లో శివగామి గా తన అద్భుతమైన నటనని ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకుంది రమ్య క్రిష్ణ.

ఈ సినిమా తరువాత రమ్యక్రిష్ణ తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసింది. ఇక “బాహుబలి” తరువాత తెలుగు లో ఆమె నటించిన సినిమా “శైలజా రెడ్డి అల్లుడు”. ఈ సినిమాలో రమ్యక్రిష్ణ పాత్రకి మంచి పేరు వస్తదని అనుకున్నారంతా…. కానీ అనుకున్నంత పేరు రాలేదు ఈ సినిమాలో రమ్యక్రిష్ణ కి.

ప్రస్తుతం రమ్యక్రిష్ణ ఒక తమిళ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కోసం రమ్యకృష్ణ చాలా రెమ్యూనరేషన్ ని అందుకున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి.

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ తో ఒక వెబ్ సీరీస్ ని మొదలుపెట్టారు. ఈ వెబ్ సీరీస్ లో జయలలిత రోల్ ని రమ్య క్రిష్ణ పోషిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నందుకు గాను రమ్య క్రిష్ణ అక్షరాల రెండు కోట్ల రూపాయలు తీసుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

First Published:  18 Jan 2019 1:41 AM GMT
Next Story