Telugu Global
NEWS

కేటీఆర్‌తో గ‌జ్వేల్‌, సిద్ధిపేట రాజ‌కీయం మారుతోందా?

తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కేటీఆర్ త‌న వ్యూహాల‌కు ప‌దునుపెట్టారు. మెద‌క్ జిల్లాలో పార్టీపై ప‌ట్టుకోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఈ జిల్లాలో హ‌రీష్‌రావు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు కేటీఆర్ త‌న‌దైన శైలిలో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇంత‌కుముందు గ‌జ్వేల్‌, సిద్ధిపేట పేరు చెబితే గుర్తుకు వ‌చ్చేది కేసీఆర్‌, హ‌రీష్‌ రావు. ఈ రెండు నియోజ‌క‌ వ‌ర్గాల‌పై హ‌రీష్‌రావుకు మంచి ప‌ట్టుంది. అయితే ఇక్క‌డే కేటీఆర్ ఇప్పుడు త‌న […]

కేటీఆర్‌తో గ‌జ్వేల్‌, సిద్ధిపేట రాజ‌కీయం మారుతోందా?
X

తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత కేటీఆర్ త‌న వ్యూహాల‌కు ప‌దునుపెట్టారు. మెద‌క్ జిల్లాలో పార్టీపై ప‌ట్టుకోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఈ జిల్లాలో హ‌రీష్‌రావు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు కేటీఆర్ త‌న‌దైన శైలిలో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

ఇంత‌కుముందు గ‌జ్వేల్‌, సిద్ధిపేట పేరు చెబితే గుర్తుకు వ‌చ్చేది కేసీఆర్‌, హ‌రీష్‌ రావు. ఈ రెండు నియోజ‌క‌ వ‌ర్గాల‌పై హ‌రీష్‌రావుకు మంచి ప‌ట్టుంది. అయితే ఇక్క‌డే కేటీఆర్ ఇప్పుడు త‌న వ‌ర్గాన్ని త‌యారు చేసుకోవాల‌ని చూస్తున్నారు. అందులో భాగంగా సిద్ధిపేట‌కు చెందిన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి సివిల్ స‌ప్ల‌య్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌ని తెలుస్తోంది.

మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి 2004లో కేసీఆర్‌పై పోటీ చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్నారు. సిద్ధిపేట బాధ్య‌తల‌ను హ‌రీష్‌రావు చేప‌ట్టిన త‌ర్వాత కూడా కేసీఆర్‌కే విధేయుడిగా ఉన్నారు. హ‌రీష్‌రావుతో గ్యాప్ మెయిన్‌టెయిన్ చేశారు.

ఈ విష‌యం తెలిసిన కేటీఆర్‌…. ఇప్పుడు సిద్ధిపేట‌లో మారెడ్డిని రంగంలోకి దింపిన‌ట్లు గులాబీ వ‌ర్గంలో గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి. హరీష్‌రావుకు మాట మాత్రం చెప్ప‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

రెండో సారి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ ఒక్క నామినేటేడ్ ప‌ద‌వి కూడా భ‌ర్తీ చేయ‌లేదు. కానీ ఈ ప‌ద‌విని భ‌ర్తీ చేయ‌డం వెనుక సిద్ధిపేటలో ప‌ట్టుకోసం కేటీఆర్ ప్ర‌య‌త్నాలు చేయ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కూడా హైద‌రాబాద్‌ ,సిద్ధిపేట‌లో ప్లెక్సీల‌తో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు.

మ‌రోవైపు గ‌జ్వేల్ రాజ‌కీయం కూడా మారుతోంది. ఇక్క‌డ ఒంటేరు ప్ర‌తాప్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించ‌డం ద్వారా ఈనియోజ‌క‌వ‌ర్గంలో హ‌రీష్‌రావు అవసరం లేకుండా చూడాల‌ని కేటీఆర్ భావిస్తున్నార‌ట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంపై పూర్తి బాధ్య‌త‌లు ఒంటేరుకు అప్ప‌గిస్తార‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ఒక వేళ కేసీఆర్‌ ఎంపీగా గెలిచి…. కేంద్ర రాజ‌కీయాల్లోకి వెళితే గ‌జ్వేల్ నుంచి ప్ర‌తాప్‌ రెడ్డిని బ‌రిలోకి దింపాల‌నేది టీఆర్ఎస్ ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది. మొత్తానికి గ‌జ్వేల్‌, సిద్ధిపేట‌లో త‌న‌దైన మార్క్‌ను కేటీఆర్ చూపించబోతున్నార‌ని టాక్ విన్పిస్తోంది.

First Published:  17 Jan 2019 11:11 PM GMT
Next Story