”మహర్షి”లో హైలైట్ సీన్స్ అవేనట?

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా “మహర్షి”. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు మల్టీ బిలియనేర్ గా నటిస్తున్నాడు.

మహేష్ బాబు అమెరికా లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎంట్రీ సీన్ స్టార్ట్  అవ్వగానే….  అక్కడ నుంచి మహేష్ బాబు తన గతాన్ని చెప్తాడట. కాలేజీలో ఎలా ఉండేవాడు? ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని పెద్ద బిజినెస్ మ్యాన్ స్టేజీకి ఎదిగాడు? అనేది ఫస్ట్ హాఫ్ కథట. ఇక ఇంటర్వెల్ సమయానికి తన ప్రాణ స్నేహితుడు అయిన అల్లరి నరేష్ సమస్యల్లో ఉన్నాడని తెలుసుకుంటాడట.

ఇక అక్కడి నుంచి సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా సాగుతుందట సినిమా. ఈ ఇంటర్వెల్ ట్విస్ట్ తో సినిమా పై అంచనాలే మారిపోతాయట.

సెకండ్ హాఫ్ లో అల్లరి నరేష్ సమస్యలను మహేష్ ఎలా సాల్వ్ చేశాడు? ఆ ప్రయాణం… మహేష్ బాబు జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొని వచ్చింది? అనేది మిగిలిన కథట.

సెకండ్ హాఫ్ లో వచ్చే పల్లెటూరి సీన్స్, మహేష్ బాబు నటన సినిమాకి హై లైట్ గా నిలుస్తాయి అని ఫిల్మ్ నగర్ టాక్.  దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.