Telugu Global
NEWS

కంగారూ గడ్డపై టీమిండియా డన్

వన్డేల్లో తొలిసారిగా ద్వైపాక్షిక సిరీస్ విజయం ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్ నెగ్గిన టీమిండియా ధోనీ 87 నాటౌట్, కేదార్ జాదవ్ 61 నాటౌట్ విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా…కంగారూ గడ్డపై మరో అరుదైన సిరీస్ విజయం సాధించింది.  మెల్బోర్న్ వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా….7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి… తీన్మార్ వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకొంది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా ద్వైపాక్షిక సిరీస్ సాధించింది. గతంలో మూడు లేదా నాలుగు జట్లు పాల్గొన్న […]

కంగారూ గడ్డపై టీమిండియా డన్
X
  • వన్డేల్లో తొలిసారిగా ద్వైపాక్షిక సిరీస్ విజయం
  • ఆస్ట్రేలియాపై 2-1తో సిరీస్ నెగ్గిన టీమిండియా
  • ధోనీ 87 నాటౌట్, కేదార్ జాదవ్ 61 నాటౌట్

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా…కంగారూ గడ్డపై మరో అరుదైన సిరీస్ విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా….7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి… తీన్మార్ వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకొంది.

ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా ద్వైపాక్షిక సిరీస్ సాధించింది. గతంలో మూడు లేదా నాలుగు జట్లు పాల్గొన్న టోర్నీల్లో విజేతగా నిలిచిన టీమిండియా…ఓ ద్వైపాక్షిక సిరీస్ లో ఆస్ట్రేలియాను..ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి..వన్డే సిరీస్ విజేతగా నిలవడం ఇదే మొదటిసారి.

ధోనీ 87, కేదార్ జాదవ్ 61 నాటౌట్ స్కోర్లతో టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర వహించారు. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ధోనీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

కంగారూ గడ్డపై 51 వన్డేలు ఆడిన టీమిండియాకు 13 విజయాలు మాత్రమే ఉండటం విశేషం. ప్రస్తుత సిరీస్ వరకూ వన్డే క్రికెట్లో… ఓవరాల్ గా ఆసీస్ తో టీమిండియా…మొత్తం 131 వన్డేల్లో ఢీ కొని… 47 విజయాల రికార్డుతో ఉంది.

ప్రస్తుత ఈ సిరీస్ లో 37 ఏళ్ల ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్రసింగ్ ధోనీ…మూడు వన్డేల్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

First Published:  18 Jan 2019 8:10 AM GMT
Next Story