వన్డే క్రికెట్ 2019 సీజన్లో  ధోనీ హాఫ్ సెంచరీల హ్యాట్రిక్

  • సిడ్నీ, అడిలైడ్,మెల్బోర్న్ వన్డేల్లో ధోనీ అర్థశతకాలు
  • సిడ్నీ వన్డేలో 96 బాల్స్ లో ధోనీ హాఫ్ సెంచరీ
  • అడిలైడ్ వన్డేలో 54 బాల్స్ లో 2 సిక్సర్ల తో ధోనీ 55 నాటౌట్
  • మెల్బోర్న్ వన్డేలో 74 బాల్స్ లో 3 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ
  • 335 వన్డేల్లో 10 సెంచరీలు, 70 హాఫ్ సెంచరీల ధోనీ

టీమిండియా ఎవర్ గ్రీన్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ…2019 వన్డే సీజన్లో హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన తీన్మార్ వన్డే సిరీస్ లోని మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ అర్థశతకాలు బాదాడు.

మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ధోనీ…74 బాల్స్ లో 3 బౌండ్రీలతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

2017 సీజన్ తర్వాత…వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీని ప్రస్తుత సిరీస్ లో భాగంగా సిడ్నీలో ముగిసిన వన్డేలో సాధించిన ధోనీ…….అడిలైడ్ ఓవల్ వన్డేలోనూ అర్థశతకం సాధించాడు.

తొలివన్డేలో …96 బాల్స్ లో హాఫ్ సెంచరీ, అడిలైడ్ వన్డేలో 54 బాల్స్ లో రెండు సిక్సర్లతో 55 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

వన్డే కెరియర్ లో 335వ మ్యాచ్ ఆడిన ధోనీ 284 వ ఇన్నింగ్స్ లో 70వ హాఫ్ సెంచరీ నమోదు చేయటం విశేషం.

 2017 సీజన్లో ధర్మశాల వేదికగా శ్రీలంకపై తన చివరి హాఫ్ సెంచరీ సాధించిన ధోనీ…మరో అర్థశతకం కోసం 2019 సీజన్ వరకూ వేచిచూడాల్సి వచ్చింది.