నిన్న రకుల్…. నేడు శ్రుతి హాసన్….

నిన్న సోషల్ మీడియా లో రకుల్ ప్రీత్ సింగ్ ఫొటో పై ఒక నెటిజన్ కామెంట్ చేయడం…. ఆ కామెంట్ పై రకుల్ ఘాటుగానే రిప్లై ఇవ్వడం తెలిసిందే. అయితే రకుల్ చేసిన కామెంట్ పై సోషల్ మీడియా లో ఒక మినీ యుద్ధమే చేస్తున్నారు నెటిజన్లు.

ఇక ఆ సంఘటన మరువక ముందే ఇప్పుడు శ్రుతి హాసన్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు విషయంలోకి వెళ్తే సోషల్ మీడియా లో 10 ఇయర్స్ ఛాలెంజ్ అంటూ ఒక ఛాలెంజ్ నడుస్తోంది. ఈ ఛాలెంజ్ లో పదేళ్ల క్రితం ఫొటోని ఇప్పుడున్న ఫొటోతో జత చేసి ఎంత మార్పు వచ్చిందో సోషల్ మీడియా లో అందరికి చూపించాలి.

అయితే ఈ ఛాలెంజ్ లో శ్రుతి హాసన్ కూడా పాల్గొని తన పదేళ్ల క్రితం ఫొటో పెట్టింది. ఆ ఫొటో కి ఇప్పుడున్న శ్రుతి ఫోటో కి చాలా మార్పు ఉంది. ఈ మార్పు కేవలం ప్లాస్టిక్ సర్జరీ వల్లే సాధ్యం అయ్యింది అని సోషల్ మీడియా లో శ్రుతి హాసన్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్ లు.

అప్పట్లో శ్రుతి హాసన్ అందంగా ఉండటం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు అవే వార్తలను మళ్లీ శ్రుతి హాసన్ ఫొటోతో ట్రోల్ అయ్యేలా చేస్తున్నాయి.