నిర్మాతకి కోపం తెప్పించిన వరుణ్ తేజ్?

వరుణ్ తేజ్ ఈ ఏడాది మొదట్లోనే “ఎఫ్ 2” సినిమాతో మంచి కామెడీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాదే ఒక కొత్త దర్శకుడిని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఒక మూవీ చేయబోతున్నాడట వరుణ్ తేజ్. ఈ సినిమా మొత్తం బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుందట. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ అన్న అల్లు బాబీ ప్రొడ్యూసర్ గా పరిచయం కానున్నాడు.

అయితే వరుణ్ తేజ్ ఈ సినిమా స్టార్ట్ చెయ్యడం ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కి ఇష్టం లేదట. ఎందుకంటే గత ఏడాది అనిల్ సుంకర నిర్మాతగా ఒక సినిమాకి సైన్ చేశాడట వరుణ్ తేజ్. ఆ సినిమా ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. ఈ సినిమాని “అప్పట్లో ఒకడుండే వాడు” ఫేమ్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రెగ్యులల్ షూటింగ్ కి నోచుకోలేదు.

వరుణ్ తేజ్ తన సినిమాలో నటించాల్సి ఉండగా వేరే సినిమాకు ఎలా సైన్ చేస్తాడన్న కోపంలో ఉన్నాడట అనిల్ సుంకర. మరి అనిల్ సుంకర ని కూల్ చెయ్యడానికి వరుణ్ తేజ్…. సుంకర ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేస్తాడో లేదో చూడాలి. 14 రీల్స్ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామ్యమై ఉంది.