తన భార్య గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన వెంకటేష్

వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటించిన “ఎఫ్ 2” సినిమా సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది.

అయితే ఈ సినిమా సక్సెస్ ని ప్రేక్షకులతో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు వెంకటేష్. ఒక ఇంటర్వ్యూ లో తన భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.

“నేను రోజూ కొంత సమయం నా భార్య కోసం కేటాయిస్తాను. షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళగానే తనతో కొంత సమయం గడిపి, సరదాగా అలా మాట్లాడుకుని భోజనం చేస్తాము…. లేకపోతే సరదాగా బయటకు, రెస్టారెంట్ కి వెళ్తాము.  ఎఫ్ 2 సినిమాలో తన పాత్రని ఇంత ఎనర్జిటిక్ గా చేశాను అంటే అది కేవలం నా భార్య సపోర్ట్ వల్లే. తను నా పక్కన ఉంటే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది” అంటూ తన భార్య గురించి చెప్పుకొచ్చాడు వెంకటేష్.

అయితే గతంలో ఎప్పుడూ తన భార్య గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడని వెంకటేష్ ఫస్ట్ టైం తన భార్య గురించి మీడియాకి చెప్పాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.