Telugu Global
NEWS

మెల్బోర్న్ వన్డేలో యుజువేంద్ర జాలం

42 పరుగులకే 6 వికెట్ల యజువేంద్ర చాహల్ 230 పరుగులకే కంగారూల ప్యాకప్ టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్… మెల్బోర్న్ వన్డేలో ఓ అసాధారణ రికార్డు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన తీన్మార్ సిరీస్ లోని ఆఖరి వన్డేలో…42 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి… కంగారూ జట్టును 230 పరుగులకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు. సిరీస్ లో తొలిసారిగా బరిలోకి దిగిన చాహల్ 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి ఏకంగా ఆరు […]

మెల్బోర్న్ వన్డేలో యుజువేంద్ర జాలం
X
  • 42 పరుగులకే 6 వికెట్ల యజువేంద్ర చాహల్
  • 230 పరుగులకే కంగారూల ప్యాకప్

టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్… మెల్బోర్న్ వన్డేలో ఓ అసాధారణ రికార్డు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన తీన్మార్ సిరీస్ లోని ఆఖరి వన్డేలో…42 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి… కంగారూ జట్టును 230 పరుగులకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు.

సిరీస్ లో తొలిసారిగా బరిలోకి దిగిన చాహల్ 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి ఏకంగా ఆరు వికెట్లు సాధించాడు.

వన్ డౌన్ క్వాజా, రెండో డౌన్ షాన్ మార్ష్, హ్యాండ్స్ కోంబ్, స్టోయినిస్, రిచర్డ్స్ సన్, జంపా…. చాహల్ బౌలింగ్ లో దొరికిపోయారు. మెల్బోర్న్ వేదికగా 2004 సిరీస్ లో అజిత్ అగార్కర్ సాధించిన 42 పరుగులకు 6 వికెట్ల రికార్డును చాహల్ సమం చేశాడు.

మెల్బోర్న్ గ్రౌండ్స్ లో మిషెల్ స్టార్క్ 43 పరుగులిచ్చి 6 వికెట్లు, క్రిస్ వోక్స్ 45 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన రికార్డులు సైతం ఉన్నాయి.

తన కెరియర్ లో 35వ వన్డే ఆడుతున్న చాహల్ 62 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. సెంచూరియన్ వేదికగా 2018లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో 22 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన ఘనత చాహల్ కు ఉంది.

First Published:  18 Jan 2019 2:48 AM GMT
Next Story