Telugu Global
Cinema & Entertainment

వరుస హిట్స్.... భారీగా ఆఫర్ చేస్తున్న నిర్మాతలు

“పటాస్” సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమా తరువాత స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనిల్ రావిపూడి తో వరుసగా మూడు సినిమాలు చేసాడు. “సుప్రీమ్” “రాజా ది గ్రేట్” తో పాటు ఇటీవలే రిలీజ్ అయిన “ఎఫ్ 2” కూడా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత కూడా అనిల్ రావిపూడి దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా చెయ్యడానికి రెడి […]

వరుస హిట్స్.... భారీగా ఆఫర్ చేస్తున్న నిర్మాతలు
X

“పటాస్” సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమా తరువాత స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనిల్ రావిపూడి తో వరుసగా మూడు సినిమాలు చేసాడు. “సుప్రీమ్” “రాజా ది గ్రేట్” తో పాటు ఇటీవలే రిలీజ్ అయిన “ఎఫ్ 2” కూడా మంచి హిట్ గా నిలిచింది.

ఈ సినిమా తరువాత కూడా అనిల్ రావిపూడి దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా చెయ్యడానికి రెడి అయ్యాడు. కానీ అనిల్ రావిపూడి కోసం బయట నిర్మాతలు కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారట. వాళ్ళు అనిల్ రావిపూడి కి 5 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేస్తున్నారట.

మరో వైపు దిల్ రాజు కూడా అనిల్ కి భారీగానే ఆఫర్ చేస్తున్నాడట. కానీ అనిల్ రావిపూడి మాత్రం ఎవరి బ్యానర్ లో సినిమా చెయ్యాలి అనేది మాత్రం డిసైడ్ కాలేదట. ఒకవేళ దిల్ రాజు బ్యానర్ లో గాని అనిల్ రావిపూడి సినిమా చేస్తే “రాజా ది గ్రేట్” కి సీక్వెల్ గాని లేకపోతే “ఎఫ్ 2” కి సీక్వెల్ గాని స్టార్ట్ చేయాలి. ఒకవేళ బయట బ్యానర్ లో చేస్తే మాత్రం కొత్త సబ్జెక్ట్ తో సినిమా స్టార్ట్ చెయ్యాలి. మరి అనిల్ ఏ దారి ఎంచుకుంటాడో చూడాలి.

First Published:  18 Jan 2019 11:37 PM GMT
Next Story