Telugu Global
NEWS

ఇకపై సర్టిఫికేట్లు జీవితకాలం చెల్లుబాటు

ప్రజలకు మరింత మెరుగైన, సులభతరమైన సేవలందించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తెస్తోంది. ఇప్పటి వరకు కుల ధృవీకరణ పత్రాలను ఆరు నెలలకొసారి కొత్తగా తేవాల్సి ఉండేది. దీని వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ పథకాలు పొందాలనుకునే వారు ఇబ్బందిపడేవారు. ప్రతి సారి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ ఆదేశాలు జారీ చేశారు. సర్టిఫికేట్ల కోసం పదేపదే తిప్పుకోవడం సరికాదని… ఒకసారి ఇచ్చిన […]

ఇకపై  సర్టిఫికేట్లు  జీవితకాలం చెల్లుబాటు
X

ప్రజలకు మరింత మెరుగైన, సులభతరమైన సేవలందించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలులోకి తెస్తోంది. ఇప్పటి వరకు కుల ధృవీకరణ పత్రాలను ఆరు నెలలకొసారి కొత్తగా తేవాల్సి ఉండేది. దీని వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ పథకాలు పొందాలనుకునే వారు ఇబ్బందిపడేవారు.

ప్రతి సారి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ ఆదేశాలు జారీ చేశారు. సర్టిఫికేట్ల కోసం పదేపదే తిప్పుకోవడం సరికాదని… ఒకసారి ఇచ్చిన సర్టిఫికేట్ జీవితాంతం ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఆదాయంలో కాలంతో పాటు మార్పు వస్తుంది కాబట్టి…. ఆదాయ ధృవీకరణ పత్రాలను నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేలా జారీ చేస్తారు. ఇందుకు సంబంధించి 15 రోజుల్లోగా జీవో జారీ చేయాలని సీఎస్ ఆదేశించారు. సర్టిఫికేట్ల జారీని సులభతరం చేసి ప్రజల ఇబ్బందిని తగ్గించాలని సూచించారు. ఇకపై కుల ధృవీకరణ పత్రం ఒకసారి జారీ చేస్తే జీవితకాలం పనికొస్తాయి.

First Published:  18 Jan 2019 8:04 PM GMT
Next Story