Telugu Global
Cinema & Entertainment

బాలకృష్ణ సరసన నాలుగో సారి

ప్రస్తుతం “ఎన్టీఆర్” బయోపిక్ రెండో భాగం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు బాలక్రిష్ణ. ఆ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బాలక్రిష్ణ కోసం ఒక కథ రెడీ చేశాడట బోయపాటి శ్రీను. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో బాలక్రిష్ణ సరసన హీరోయిన్ గా నటించడానికి నయనతార ని తీసుకోనున్నారట బోయపాటి. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వం లో […]

బాలకృష్ణ సరసన నాలుగో సారి
X

ప్రస్తుతం “ఎన్టీఆర్” బయోపిక్ రెండో భాగం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు బాలక్రిష్ణ. ఆ సినిమా తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బాలక్రిష్ణ కోసం ఒక కథ రెడీ చేశాడట బోయపాటి శ్రీను. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

అయితే ఈ సినిమాలో బాలక్రిష్ణ సరసన హీరోయిన్ గా నటించడానికి నయనతార ని తీసుకోనున్నారట బోయపాటి. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వం లో ‘తులసి’, ‘సింహా’ సినిమాలలో హీరోయిన్ గా నటించింది నయనతార. ఇక బాలక్రిష్ణ సరసన “సింహ” “శ్రీ రామ రాజ్యం” “జై సింహ” వంటి సినిమాల్లో నటించింది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమాగా ఇది తెరకెక్కనుంది.

ఎన్. బి.కె ఎంటర్ టైన్ మెంట్స్ పై నందమూరి బాలక్రిష్ణే స్వయంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి సరసన “సై రా” సినిమాలో నటిస్తున్న నయనతార…. ఇప్పుడు మరో పెద్ద సినిమాలో నటించబోతోంది.

First Published:  19 Jan 2019 6:30 AM GMT
Next Story