Telugu Global
National

యుద్ధ ట్యాంక్‌ను నడిపిన మోడీ

నరేంద్ర మోడీ యుద్ధ ట్యాంకును నడిపారు. అహ్మదాబాద్‌లో కే9 వజ్రా హవిజన్‌ యుద్ధ ట్యాంకును పరిశీలించిన మోడీ… స్వయంగా దాన్ని కాసేపు నడిపారు. ఎల్‌ అండ్ టీ సంస్థ దీన్ని తయారు చేసింది. గుజరాత్ పర్యటనకు వచ్చిన ప్రధాని… అహ్మాదాబాద్‌లోనే యుద్ద ట్యాంకును ఆవిష్కరించారు. రానున్న రెండేళ్లలో 100 హవిజన్ యుద్ధ ట్యాంకులను రక్షణ శాఖకు అందజేయనుంది తయారీ సంస్థ. ఈ మేరకు రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. సూరత్‌కు సమీపంలోని హజిరా వద్ద ఆర్మర్డ్ సిస్టమ్స్‌ […]

యుద్ధ ట్యాంక్‌ను నడిపిన మోడీ
X

నరేంద్ర మోడీ యుద్ధ ట్యాంకును నడిపారు. అహ్మదాబాద్‌లో కే9 వజ్రా హవిజన్‌ యుద్ధ ట్యాంకును పరిశీలించిన మోడీ… స్వయంగా దాన్ని కాసేపు నడిపారు.

ఎల్‌ అండ్ టీ సంస్థ దీన్ని తయారు చేసింది. గుజరాత్ పర్యటనకు వచ్చిన ప్రధాని… అహ్మాదాబాద్‌లోనే యుద్ద ట్యాంకును ఆవిష్కరించారు. రానున్న రెండేళ్లలో 100 హవిజన్ యుద్ధ ట్యాంకులను రక్షణ శాఖకు అందజేయనుంది తయారీ సంస్థ.

ఈ మేరకు రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. సూరత్‌కు సమీపంలోని హజిరా వద్ద ఆర్మర్డ్ సిస్టమ్స్‌ కాంప్లెక్స్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. అక్కడే వీటిని తయారు చేస్తున్నారు. తాను యుద్ధ ట్యాంకును నడిపిన వీడియోను మోడీ ట్వీట్ చేశారు. యుద్ధ ట్యాంకును తయారు చేసిన సంస్థను అభినందించారాయన. యుద్ధ ట్యాంకు ఆవిష్కరణ కార్యక్రమంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా పాల్గొన్నారు. యుద్ధ ట్యాంకుల తయారీ యూనిట్ ను ప్రధాని పరిశీలించారు.

First Published:  19 Jan 2019 4:50 AM GMT
Next Story