Telugu Global
Cinema & Entertainment

ఎఫ్2 ఫస్ట్ వీక్ వసూళ్లు

నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది ఎఫ్2 సినిమా. వరల్డ్ వైడ్ హిట్ అయిన ఈ సినిమాకు ఓవరాల్ గా 43 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 35 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఓవర్సీస్ లో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. తన బ్యానర్ పై అత్యధిక లాభాలు తెస్తున్న సినిమా ఎఫ్2 మాత్రమే అని ప్రకటించాడు దిల్ రాజు. ఇప్పటివరకు తమ బ్యానర్ పై […]

ఎఫ్2 ఫస్ట్ వీక్ వసూళ్లు
X

నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది ఎఫ్2 సినిమా. వరల్డ్ వైడ్ హిట్ అయిన ఈ సినిమాకు ఓవరాల్ గా 43 కోట్ల రూపాయల నెట్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 35 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఓవర్సీస్ లో ఈ సినిమా 2 మిలియన్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.

తన బ్యానర్ పై అత్యధిక లాభాలు తెస్తున్న సినిమా ఎఫ్2 మాత్రమే అని ప్రకటించాడు దిల్ రాజు. ఇప్పటివరకు తమ బ్యానర్ పై 31 సినిమాలు నిర్మిస్తే, ఏ సినిమాకు ఎఫ్2కు వచ్చినన్ని లాభాలు రాలేదని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

  • నైజాం – రూ. 11.82 కోట్లు
  • సీడెడ్ – రూ. 4.57 కోట్లు
  • ఉత్తరాంధ్ర – రూ. 4.75 కోట్లు
  • ఈస్ట్ – రూ. 4.24 కోట్లు
  • వెస్ట్ – రూ. 2.36 కోట్లు
  • గుంటూరు – రూ. 3.14 కోట్లు
  • కృష్ణా – రూ. 3.12 కోట్లు
  • నెల్లూరు – రూ. 1.11 కోట్లు
First Published:  19 Jan 2019 6:02 AM GMT
Next Story