విజయ్ ప్రొడ్యూసర్….. తరుణ్ భాస్కర్ సరసన అనసూయ !

“అర్జున్ రెడ్డి” “గీత గోవిందం” సినిమాలతో తన మార్కెట్ పరిధిని పెంచుకున్న విజయ్ దేవరకొండ “నోటా” సినిమా ద్వారా కొత్త ప్రొడక్షన్ హౌస్ ని కూడా స్టార్ట్ చేశాడు. “కింగ్ ఆఫ్ ది హిల్” అనే పేరు పెట్టిన ఈ ప్రొడక్షన్ హౌస్ పై చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తానని విజయ్ దేవరకొండ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు.

ఈ బ్యానర్ లో తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయనున్నాడు విజయ్. స్వతహాగా డైరెక్టర్ అయిన తరుణ్ కి నటన అంటే చాలా ఇష్టమట. అందుకే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పాడట తరుణ్ భాస్కర్.

ఇక ఇందులో ఆసక్తికరమైన విషయమేమిటంటే యాంకర్ అనసూయ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోందట. విజయ్ దేవరకొండ తో ఉన్న స్నేహం వల్లే అనసూయ ఈ సినిమాకి ఓకే చెప్పిందన్న వార్త చక్కర్లు కొడుతోంది.

అయితే తరుణ్ భాస్కర్, అనసూయ మాత్రమే కాక మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారట. ఈ నలుగురి పాత్రల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందట. మిగతా రెండు పాత్రల్లో ఎవరు చేయనున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. మరి డైరెక్టర్ గా ఇప్పటికే సక్సెస్ లో ఉన్న తరుణ్ భాస్కర్ హీరోగా ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి.