Telugu Global
National

ఎన్నికల వేళ కొత్తగా రాబోతున్న న్యూస్ ఛానల్స్ ఇవే!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు కొత్త న్యూస్ ఛాన‌ల్స్ సంద‌డి చేయ‌బోతున్నాయి. తెలుగులోకి ఒకటో రెండో చాన‌ళ్లు వ‌స్తున్నాయి. కానీ అవి లాంచ్ అయ్యే వ‌ర‌కు తెలియ‌దు. కానీ హిందీలో మాత్రం ఈ సారి రెండు, మూడు చాన‌ళ్లు రాబోతున్నాయి. వాటిలో ముఖ్య‌మైన‌వి రెండు. ఒక‌టి అర్నబ్‌గో స్వామి హిందీ చాన‌ల్‌. రెండోది టీవీ9 హిందీ చాన‌ల్‌. అర్న‌బ్ గోస్వామి ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే రిప‌బ్లిక్ ఇంగ్లీష్ న్యూస్ చాన‌ల్ న‌డుస్తోంది. అయితే ఇప్పుడు హిందీలో కూడా న్యూస్ చాన‌ల్ […]

ఎన్నికల వేళ కొత్తగా రాబోతున్న న్యూస్ ఛానల్స్ ఇవే!
X

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు కొత్త న్యూస్ ఛాన‌ల్స్ సంద‌డి చేయ‌బోతున్నాయి. తెలుగులోకి ఒకటో రెండో చాన‌ళ్లు వ‌స్తున్నాయి. కానీ అవి లాంచ్ అయ్యే వ‌ర‌కు తెలియ‌దు. కానీ హిందీలో మాత్రం ఈ సారి రెండు, మూడు చాన‌ళ్లు రాబోతున్నాయి. వాటిలో ముఖ్య‌మైన‌వి రెండు. ఒక‌టి అర్నబ్‌గో స్వామి హిందీ చాన‌ల్‌. రెండోది టీవీ9 హిందీ చాన‌ల్‌.

అర్న‌బ్ గోస్వామి ఆధ్వ‌ర్యంలో ఇప్ప‌టికే రిప‌బ్లిక్ ఇంగ్లీష్ న్యూస్ చాన‌ల్ న‌డుస్తోంది. అయితే ఇప్పుడు హిందీలో కూడా న్యూస్ చాన‌ల్ తీసుకొస్తున్నారు. ఈ ఛాన‌ల్ పేరు రిప‌బ్లిక్ భార‌త్‌. ఇప్ప‌టికే దీని ప్రోమోలు న‌డుస్తున్నాయి. జ‌న‌వ‌రి 26న చాన‌ల్ ప్ర‌సారాలు ప్రారంభం కాబోతున్నాయి.

టీవీ9 గ్రూపు కూడా మరో న్యూస్ చాన‌ల్ తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే చాన‌ల్ రిక్రూట్‌మెంట్ పూర్తి చేసింది. గ‌తంలో స్టార్ ఇండియా, ఇండియా టీవీలో ప‌నిచేసిన వినోద్ క‌ప్రీ ఈ చాన‌ల్‌కు హెడ్‌. ఫిబ్ర‌వ‌రి 9న చాన‌ల్ లాంచ్ చేస్తార‌ని ప్ర‌సారం జ‌రుగుతోంది. లేదా ఫిబ్ర‌వ‌రి 14న అధికారికంగా ప్ర‌సారాలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. టీవీ9 తెలుగు ప్ర‌సారాలు కూడా ఫిబ్ర‌వ‌రిలోనే మొద‌ల‌య్యాయి.

మ‌రోవైపు ఎన్డీటీవీ మాజీ జ‌ర్న‌లిస్టు బ‌ర్ఖాదత్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు క‌ర‌ణ్ థాప‌ర్ ఆధ్వ‌ర్యంలో హార్వెస్ట్ టీవీ రాబోతుంది. ఈ ఛాన‌ల్‌ కు కాంగ్రెస్ నేత క‌పిల్ సిబాల్ ప్ర‌మోట‌ర్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఇంగ్లీష్ ఛాన‌ల్ కూడా త్వ‌ర‌లోనే లాంచ్ కాబోతుంది. నెట్‌వ‌ర్క్ 18 ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ పోస్ట్ వార ప‌త్రిక రాబోతుంది.

First Published:  18 Jan 2019 7:56 PM GMT
Next Story