Telugu Global
International

పదేళ్ల చాలెంజ్‌లో ప్రియాంక చోప్రా ట్రోల్

సోషల్ మీడియాలో మరోసారి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్రోల్ అవుతున్నారు. ఈసారి కూడా ఆమె వివాహాన్ని టార్గెట్‌గా చేసుకునే ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో #10yearschallenge పేరు ఒక చాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. పదేళ్ల క్రితం ఎలా ఉన్నారు … ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నది తెలియజేస్తూ ఫొటోలను షేర్‌ చేయడం ఈ చాలెంజ్‌ ఉద్దేశం. అయితే కొందరు నెటిజన్లు ప్రియాంక చోప్రాను లాగారు. తన కంటే వయసులో చాలా చిన్నవాడైన నిక్‌ను […]

పదేళ్ల చాలెంజ్‌లో ప్రియాంక చోప్రా ట్రోల్
X

సోషల్ మీడియాలో మరోసారి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్రోల్ అవుతున్నారు. ఈసారి కూడా ఆమె వివాహాన్ని టార్గెట్‌గా చేసుకునే ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో #10yearschallenge పేరు ఒక చాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. పదేళ్ల క్రితం ఎలా ఉన్నారు … ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నది తెలియజేస్తూ ఫొటోలను షేర్‌ చేయడం ఈ చాలెంజ్‌ ఉద్దేశం. అయితే కొందరు నెటిజన్లు ప్రియాంక చోప్రాను లాగారు.

తన కంటే వయసులో చాలా చిన్నవాడైన నిక్‌ను ప్రియాంక పెళ్లి చేసుకున్న నేపథ్యంలో #10yearschallenge ను ఆమెకు అన్వయించారు. 2009లో ప్రియాంక ఒక చిన్న పిల్లాడిని ఎత్తుకున్న ఫొటోను…. 2019లో భర్త నిక్‌తో ఉన్న ఫొటోను పక్కన పక్కన పెట్టి షేర్ చేశారు. పదేళ్ల క్రితం ఎత్తుకున్న పిల్లాడే… ఇప్పుడు ప్రియాంకకు భర్త అయ్యారన్న ఉద్దేశం వచ్చేలా ఈ ఫొటోను తిప్పుతున్నారు.

దీనిపై పలువురు మహిళలు తీవ్రంగా స్పందిస్తున్నారు. మగాళ్లు తమ కంటే 25 ఏళ్లు తక్కువ వయసున్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే ఈ దేశంలో ఎవరూ ప్రశ్నించరని… కానీ ఒక అమ్మాయి తన కంటే తక్కువ వయసు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇలాంటి ట్రోల్ చేస్తుంటారని… గాయని చిన్మయి మండిపడ్డారు.

First Published:  19 Jan 2019 11:20 AM GMT
Next Story