Telugu Global
NEWS

టెన్నిస్ లెజండ్ తో ప్రపంచ క్రికెట్ సంచలనం

ఆస్ట్రేలియన్ ఓపెన్లో విరుష్క జోడీ సందడి ఫెదరర్ తో విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ ఆస్ట్రేలియాలో 64 రోజుల పర్యటనను అత్యంత విజయవంతంగా ముగించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తన భార్య అనుష్క తో కలిసి…మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సందడి సందడి చేశాడు. తన అభిమాన ఆటగాడు, టెన్నిస్ గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ తో కలిసి కొన్ని క్షణాలు గడిపాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ కు వేదికగా ఉన్న మెల్బోర్న్ లోని […]

టెన్నిస్ లెజండ్ తో ప్రపంచ క్రికెట్ సంచలనం
X
  • ఆస్ట్రేలియన్ ఓపెన్లో విరుష్క జోడీ సందడి
  • ఫెదరర్ తో విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ

ఆస్ట్రేలియాలో 64 రోజుల పర్యటనను అత్యంత విజయవంతంగా ముగించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తన భార్య అనుష్క తో కలిసి…మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సందడి సందడి చేశాడు. తన అభిమాన ఆటగాడు, టెన్నిస్ గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్ తో కలిసి కొన్ని క్షణాలు గడిపాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ కు వేదికగా ఉన్న మెల్బోర్న్ లోని ఫ్లిండర్స్ పార్క్…రాడ్ లేవర్ ఎరీనాలో….డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ ను కొహ్లీ కలిశాడు. తన భార్య అనుష్క శర్మను పరిచయం చేశాడు.

ఫెదరర్ తో కలిసి కొహ్లీ, అనుష్క జోడీ ఫోటోలు దిగి..ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానుల ముందుంచారు.

వరుసగా మూడో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కు గురిపెట్టిన 3వ సీడ్ రోజర్ ఫెదరర్ నాలుగో రౌండ్ కు అర్హత సాధించడం ద్వారా సేద తీరాడు. తన విరామ సమయంలో కలవటానికి వచ్చిన విరాట్ కొహ్లీ, అనుష్కలకు ఫెదరర్ తగిన సమయం కేటాయించి తన క్రీడాస్ఫూర్తిని చాటుకొన్నాడు.

First Published:  19 Jan 2019 11:26 AM GMT
Next Story