Telugu Global
Cinema & Entertainment

"బ్రహ్మోత్సవం" ఎఫెక్ట్..... మరీ ఈ సినిమా అయినా ఓకే అవుతుందా?

ఎంత పెద్ద డైరెక్టర్ కి అయినా ఒక భారీ ప్లాప్ వస్తే ఆ డైరెక్టర్ కెరీర్ పాతాళంలోకి పడిపోతుంది. ఇప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా పరిస్థితి కూడా అంతే. “కొత్త బంగారులోకం” సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలా ఆ తరువాత మహేష్ బాబు, వెంకటేష్ లని హీరోలుగా పెట్టి మల్టీస్టారర్స్ కి శ్రీకారం చుడుతూ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాని డైరెక్ట్ చేసాడు. ఆ తరువాత మహేష్ బాబుతో “బ్రహ్మోత్సవం” తో భారీ […]

బ్రహ్మోత్సవం ఎఫెక్ట్..... మరీ ఈ సినిమా అయినా ఓకే అవుతుందా?
X

ఎంత పెద్ద డైరెక్టర్ కి అయినా ఒక భారీ ప్లాప్ వస్తే ఆ డైరెక్టర్ కెరీర్ పాతాళంలోకి పడిపోతుంది. ఇప్పుడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా పరిస్థితి కూడా అంతే. “కొత్త బంగారులోకం” సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలా ఆ తరువాత మహేష్ బాబు, వెంకటేష్ లని హీరోలుగా పెట్టి మల్టీస్టారర్స్ కి శ్రీకారం చుడుతూ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాని డైరెక్ట్ చేసాడు.

ఆ తరువాత మహేష్ బాబుతో “బ్రహ్మోత్సవం” తో భారీ ప్లాప్ ని అందుకున్నాడు. ఆ ప్లాప్ తరువాత ఇప్పటి వరకు శ్రీకాంత్ అడ్డాలా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆ మధ్య శర్వానంద్ డేట్స్ ఇచ్చాడు అనే టాక్ వినిపించినా అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి.

ఇక ఇప్పుడు విక్టరీ వెంకటేశ్ శ్రీకాంత్ అడ్డాలా కి రెండో సారి అవకాశం ఇచ్చాడు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరి ఇటీవలే “ఎఫ్ 2” సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ ఏ నమ్మకంతో శ్రీకాంత్ అడ్డాలాకి అవకాశం ఇచ్చాడో. శ్రీకాంత్ అడ్డాలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి.

First Published:  19 Jan 2019 12:37 AM GMT
Next Story