Telugu Global
Cinema & Entertainment

కామెడీ అయిపోయింది..... థ్రిల్లర్ మీద పడ్డ వెంకటేష్

“ఎఫ్ 2” సినిమాతో మళ్ళీ తన కామెడీ టైమింగ్ ని బయట పెట్టిన వెంకటేష్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడట. అయితే వెంకటేష్ ఇప్పుడు ఒక థ్రిల్లర్ సినిమాకి రెడీ అవుతున్నాడు. “సినిమా చూపిస్తా మామ”, “నేను లోకల్” లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన త్రినాధరావు నక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఇప్పటిదాకా ప్రేమ కథా చిత్రాలతో […]

కామెడీ అయిపోయింది..... థ్రిల్లర్ మీద పడ్డ వెంకటేష్
X

“ఎఫ్ 2” సినిమాతో మళ్ళీ తన కామెడీ టైమింగ్ ని బయట పెట్టిన వెంకటేష్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడట. అయితే వెంకటేష్ ఇప్పుడు ఒక థ్రిల్లర్ సినిమాకి రెడీ అవుతున్నాడు.

“సినిమా చూపిస్తా మామ”, “నేను లోకల్” లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన త్రినాధరావు నక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఇప్పటిదాకా ప్రేమ కథా చిత్రాలతో మన ముందుకు వచ్చిన త్రినాధ రావు మొదటి సారి ఒక థ్రిల్లర్ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.

మరి త్రినాధ్ రావు రాసుకున్న ఈ కథలో వెంకటేష్ ని మెప్పించిన పాయింట్ ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఈ సినిమాతో పాటు “వెంకీ మామ” సినిమాలో కూడా వెంకటేష్ నటించనున్నాడు. నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాని బాబీ డైరెక్ట్ చేయనున్నాడు.

First Published:  19 Jan 2019 6:35 AM GMT
Next Story