హార్దిక్‌ పాండ్యాపై మాజీ గాళ్‌ ఫ్రెండ్ స్పందన

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న క్రికెటర్ హార్ధిక్ పాండ్యా వ్యవహారంపై మాజీ గర్ల్‌ఫ్రెండ్, నటి ఎల్లి స్పందించింది. పాండ్యాను తప్పుపడుతూనే అతడిపై కాస్త సానుభూతి చూపించింది.

హార్దిక్ అలా మాట్లాడడం చూసి షాక్‌కు గురయ్యానని చెప్పారామె. మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై అందరూ తీవ్రంగా స్పందించడం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు. అయితే తనకు తెలిసి హార్దిక్‌ పాండ్యా అలాంటి చెడ్డ వ్యక్తి కాదని మాజీ గర్ల్ ఫ్రెండ్ ఎల్లి సర్టిఫై చేసింది.

మహిళలపై వ్యాఖ్యలు చేసే వారు 2019లో ఉన్నారన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం మహిళలు గళమెత్తగలిగే పరిస్థితుల్లో ఉన్నారన్నారు. తమపై జరిగే దాడిని మహిళలు సహించే ప్రసక్తే లేదన్నారు.