Telugu Global
Cinema & Entertainment

96 రీమేక్ ఫిక్స్.... సమంత హీరోయిన్

తమిళనాట సూపర్ హిట్ అయిన 96 సినిమా తెలుగులోకి రాబోతోంది. ఈ మేరకు దిల్ రాజు రీమేక్ పై క్లారిటీ ఇచ్చేశాడు. ఎఫ్2 తర్వాత తన నెక్ట్స్ సినిమా ఇదేనని ప్రకటించాడు. కోలీవుడ్ లో 96 పెద్ద హిట్ అయింది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఆ సినిమా రీసెంట్ గా 100 రోజులు పూర్తిచేసుకుంది. ఇప్పుడా సినిమా రీమేక్ లో శర్వానంద్, సమంత నటించబోతున్నారు. నిజానికి ఈ సినిమాలో ముందుగా నానిని హీరోగా తీసుకోవాలనుకున్నారు. […]

96 రీమేక్ ఫిక్స్.... సమంత హీరోయిన్
X

తమిళనాట సూపర్ హిట్ అయిన 96 సినిమా తెలుగులోకి రాబోతోంది. ఈ మేరకు దిల్ రాజు రీమేక్ పై క్లారిటీ ఇచ్చేశాడు. ఎఫ్2 తర్వాత తన నెక్ట్స్ సినిమా ఇదేనని ప్రకటించాడు. కోలీవుడ్ లో 96 పెద్ద హిట్ అయింది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఆ సినిమా రీసెంట్ గా 100 రోజులు పూర్తిచేసుకుంది. ఇప్పుడా సినిమా రీమేక్ లో శర్వానంద్, సమంత నటించబోతున్నారు.

నిజానికి ఈ సినిమాలో ముందుగా నానిని హీరోగా తీసుకోవాలనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టుపై అంతగా నమ్మకంలేని నాని తప్పుకున్నాడు. దీంతో శర్వానంద్ ను రంగంలోకి దించారు. ఇక సమంత విషయానికొస్తే మొదట రీమేక్ ను ఖండించింది సమంత. ఇలాంటి మంచి సినిమాను రీమేక్ చేయకూడదంటూ ట్వీట్ కూడా చేసింది. కానీ దిల్ రాజు నచ్చజెప్పడంతో నటించడానికి ఒప్పుకుంది.

పేరుకు ఇది రీమేక్ అయినప్పటికీ చాలామార్పులు చేస్తామని ప్రకటించాడు దిల్ రాజు. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో సన్నివేశాలతో పాటు వీలైతే క్లైమాక్స్ కూడా మారుస్తామని ప్రకటించాడు. తమిళ్ లో 96ను డైరక్ట్ చేసిన ప్రేమ్ కుమార్.. రీమేక్ తో టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు.

First Published:  20 Jan 2019 12:28 AM GMT
Next Story