వాస్తు కోసం…. ఎస్‌ఆర్‌ నగర్ పోలీసులు ఏం చేశారో తెలుసా….

గుండ్రంగా ఉన్న భూమికి వాస్తు ఉంటుందా?!. అదేమో గానీ… ముఖ్యమంత్రుల నుంచి చివరకు పోలీసుల వరకు వాస్తు పేరు చెబితే హడలిపోతున్నారు. హైదరాబాద్ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు కూడా వాస్తు భయం పట్టుకుంది.

ఇటీవల స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులు పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందా అని పోలీసులు మదనపడ్డారు. వాస్తు నిపుణులను తీసుకొచ్చి తాము వివాదాల్లో చిక్కుకోవడానికి…. వాస్తుకు సంబంధం ఉందా? అని ఆరా తీశారు.

వాస్తు నిపుణులు చెప్పడంతో ఏకంగా స్టేషన్ గోడను పోలీసులే కూల్చేసుకున్నారు. వాస్తుకోసమే ఇలా చేశారని తెలియడంతో ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు.

గోడను కూల్చేసిన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు మాత్రం దీనిపై స్పందించకుండా గుంభనంగా ఉన్నారు.