పూర్తి స్థాయి పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో….

“నా నువ్వే” సినిమాతో ప్లాప్ ని అందుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఒక థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. “118” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని కె.వి గుహన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయిన గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. షాలిని పాండే , నివేద థామస్ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ విరించి వర్మ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసాడు. 

అయితే ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తాడట విరించి వర్మ.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక విలేజ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక అద్భుతమైన ప్రేమ కథ తో మన ముందుకు రాబోతున్నాడు కళ్యాణ్ రామ్. అప్పుడెప్పుడో తేజ దర్శకత్వంలో వచ్చిన “లక్ష్మీ కళ్యాణం” అనే పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసాడు కళ్యాణ్ రామ్. మళ్ళీ ఇన్నాళ్ళకి కళ్యాణ్ రామ్ మరో పల్లెటూరి డ్రామా లో నటించనున్నాడు.