టెన్త్‌ విద్యార్థిని పై ప్రిన్సిపల్ లైంగిక దాడి

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక విద్యార్థినిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి చేశారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు స్కూల్‌ ముందు ఆందోళనకు దిగారు. ఎంఆర్‌ఆర్‌ ప్రైవేట్‌ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది.

స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్‌ లైంగిక దాడి చేసి… గర్భానికి కారణమయ్యారని అమ్మాయి కుటుంబసభ్యులు చెబుతున్నారు. స్కూల్‌ ముందు ఆందోళనకు దిగిన బాధితురాలి కుటుంబసభ్యులకు పలువురు మద్దతు పలికారు.

వెంటనే ప్రిన్సిపల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రిన్సిపల్‌ పరారిలో ఉన్నాడు.