Telugu Global
Cinema & Entertainment

వెబ్ సిరీస్ రూపంలో ఏఎన్ఆర్ బయోపిక్

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన “ఎన్టీఆర్-కథానాయకుడు” బయోపిక్ సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. చూస్తుంటే సినిమా లాస్ తో క్లోజ్ అయ్యేలాగే కనిపిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్  దశలో ఉండగానే అక్కినేని నాగార్జున ని ఏఎన్ఆర్ బయోపిక్ ఎప్పుడు తీస్తారు అంటూ మీడియా వారు అడిగారు. కానీ నాగార్జున మాత్రం నాగేశ్వర రావు జీవితంలో అంత పెద్ద డ్రామా లేదు అంటూ బయోపిక్ […]

వెబ్ సిరీస్ రూపంలో ఏఎన్ఆర్ బయోపిక్
X

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన “ఎన్టీఆర్-కథానాయకుడు” బయోపిక్ సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. చూస్తుంటే సినిమా లాస్ తో క్లోజ్ అయ్యేలాగే కనిపిస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే అక్కినేని నాగార్జున ని ఏఎన్ఆర్ బయోపిక్ ఎప్పుడు తీస్తారు అంటూ మీడియా వారు అడిగారు. కానీ నాగార్జున మాత్రం నాగేశ్వర రావు జీవితంలో అంత పెద్ద డ్రామా లేదు అంటూ బయోపిక్ మాటని దాట వేసాడు.

కానీ ఇప్పుడు ఈ బయోపిక్ ని వెబ్ సిరీస్ రూపం లో తీస్తే బాగానే ఉంటుంది అని నాగార్జున భావిస్తున్నాడట. ఎందుకంటే సినిమా రూపం లో తీస్తే “ఎన్టీఆర్” సినిమా లాగ నష్టాల పాలయ్యే అవకాశం ఉందని…. తెలివిగా వెబ్ సిరీస్ ని ప్లాన్ చేసాడు నాగార్జున.

ఈ విషయం పై అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇదిలా ఉంటే రమ్య క్రిష్ణ నటిస్తున్న జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ రూపంలోనే తమిళ ప్రేక్షకుల ముందుకి రానుంది.

First Published:  21 Jan 2019 1:23 AM GMT
Next Story