రాధాకు జగన్‌ ఇచ్చిన ఆఫర్‌ను వివరించిన శ్రీకాంత్ రెడ్డి

వంగవీటి రాధా వైసీపీకి రాజీనామా చేయడం దురదృష్టకరమన్నారు వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాధా వైసీపీలో ఉండాలని కోరుకున్న వారిలో తానూ ఒకరినన్నారు. కానీ ఆయన ఎందుకు పార్టీని వీడారో అర్థం కావడం లేదన్నారు.

2014లో పోటీ చేసిన విజయవాడ తూర్పు నుంచే పోటీ చేయాల్సిందిగా జగన్‌ సూచించారన్నారు. ఒకవేళ ఫలితం తేడాగా వస్తే ఎమ్మెల్సీ ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారన్నారు. వంగవీటి రాధాకు ఏ నేతకు ఇవ్వనంత భరోసా జగన్‌ ఇచ్చారని వివరించారు.

రాధా వద్దకు విజయసాయిరెడ్డి, బొత్స, ఉమ్మారెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డిలు వెళ్లి చర్చలు కూడా జరిపారన్నారు. రాధా టీడీపీలో చేరుతారని వార్తలొస్తున్నాయని… రంగాను దారుణంగా చంపిన టీడీపీలోకి వెళ్లడం ఎంత వరకు సమంజసమో రాధా ఆలోచించుకోవాలన్నారు.