Telugu Global
NEWS

న్యూజిలాండ్ కోటలో టీమిండియా పాగా

కివీ హంట్ కు కొహ్లీ సేన సిద్ధం 23 నుంచి కివీస్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి తీన్మార్ టీ-20 సిరీస్ వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా…. ట్రాన్స్ టాస్మన్ జైత్రయాత్రలో ఆఖరి ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. తొలి అంచెలో కంగారూ జట్టును కంగు తినిపించి టెస్ట్, వన్డే సిరీస్ లు నెగ్గిన విరాట్ సేన…. ఇప్పుడు న్యూజిలాండ్ కోటలో అడుగుపెట్టింది. పాంచ్ పటాకా వన్డే సిరీస్ తో పాటు…తీన్మార్ టీ-20 […]

న్యూజిలాండ్ కోటలో టీమిండియా పాగా
X
  • కివీ హంట్ కు కొహ్లీ సేన సిద్ధం
  • 23 నుంచి కివీస్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్
  • ఫిబ్రవరి 6 నుంచి తీన్మార్ టీ-20 సిరీస్

వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా…. ట్రాన్స్ టాస్మన్ జైత్రయాత్రలో ఆఖరి ఘట్టానికి రంగం సిద్ధమయ్యింది. తొలి అంచెలో కంగారూ జట్టును కంగు తినిపించి టెస్ట్, వన్డే సిరీస్ లు నెగ్గిన విరాట్ సేన…. ఇప్పుడు న్యూజిలాండ్ కోటలో అడుగుపెట్టింది. పాంచ్ పటాకా వన్డే సిరీస్ తో పాటు…తీన్మార్ టీ-20 సిరీస్ ల్లో అమీతుమీ తేల్చుకోనుంది.

విరాట్ సేనకు అసలు పరీక్ష….

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్, వన్డే, టీ-20 ఫార్మాట్ల రెండోర్యాంకర్ టీమిండియా….ట్రాన్స్ టాస్మన్ దేశాల జైత్రయాత్ర..ఆఖరి ఘట్టానికి న్యూజిలాండ్ లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

ఇప్పటికే ఆస్ట్రేలియాతో ముగిసిన టీ-20, టెస్ట్, వన్డే సిరీస్ ల్లో అజేయంగా నిలవడం ద్వారా…రికార్డుల మోత మోగించిన టీమిండియా…. ఇక… న్యూజిలాండ్ తో ఐదుమ్యాచ్ ల వన్డే, తీన్మార్ టీ-20 సిరీస్ ల సమరం కోసం కివీల్యాండ్ లో అడుగుపెట్టింది.

టీమిండియా 2, న్యూజిలాండ్ 3….

ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం…టీమిండియా రెండో ర్యాంక్ లో ఉంటే…న్యూజిలాండ్ మూడోర్యాంక్ లో కొనసాగుతోంది.

టీమిండియాకు ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు విరాట్ కొహ్లీ నాయకత్వం వహిస్తుంటే…న్యూజిలాండ్ కు 11వ ర్యాంకర్ కేన్ విలియమ్స్ సన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

23 నుంచి వన్డే సిరీస్….

ఈ రెండుజట్ల..వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్…ఈనెల 23న..నేపియర్ వేదికగా ప్రారంభమవుతుంది. సిరీస్ లోని రెండో వన్డేకి మౌంట్ మాంగనీ ఆతిథ్యమిస్తోంది. ఈమ్యాచ్ జనవరి 26న ప్రారంభమవుతుంది.

సిరీస్ లోని మూడో వన్డే సైతం మౌంట్ మాంగనీ వేదికగానే ఈనెల 29న జరుగుతుంది. నాలుగో వన్డే మ్యాచ్ హామిల్టన్ వేదికగా జనవరి 31న నిర్వహిస్తారు.

సిరీస్ లోని ఆఖరి వన్డే…ఫిబ్రవరి 3న వెలింగ్టన్ వేదికగా జరుగుతుంది. 6వ ర్యాంకర్ ఆస్ట్రేలియాతో పోల్చిచూస్తే…మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ జట్టు….టీమిండియాకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

వన్డే మ్యాచ్ లన్నీ…ఆయా తేదీలలో…భారత కాలమానప్రకారం ఉదయం 7 గంటల 30నిముషాలకు ప్రారంభమవుతాయి.

ఫిబ్రవరి 6 నుంచి టీ-20 సిరీస్….

ఇక…ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో టీమిండియా…రెండో ర్యాంక్ లో ఉంటే…న్యూజిలాండ్ మాత్రం 6వ ర్యాంక్ జట్టుగా ఉంది.

వెలింగ్టన్ వేదికగా ఫిబ్రవరి 6న… తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాతి మ్యాచ్…ఫిబ్రవరి 9న అక్లాండ్ వేదికగా నిర్వహిస్తారు.

సిరీస్ లోని ఆఖరి టీ-20 మ్యాచ్ … ఫిబ్రవరి 10న హామిల్టన్ వేదికగా నిర్వహిస్తారు. భారత కాలమాన ప్రకారం టీ-20 మ్యాచ్ లు ఆయా తేదీలలో…మధ్యాహ్నం.. 12 గంటల 30 నిముషాలకు ప్రారంభమవుతాయి.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా… పాంచ్ పటాకా వన్డే, తీన్మార్ టీ-20 సిరీస్ ల్లో నెగ్గి… డబుల్ ధమాకాతో స్వదేశానికి తిరిగిరావాలన్న పట్టుదలతో ఉంది.

పవర్ ఫుల్ టీమిండియాకు…న్యూజిలాండ్ సమఉజ్జీగా నిలుస్తుందా? ..లేదా అన్నదే ఇక్కడి అసలుపాయింట్.

First Published:  21 Jan 2019 10:00 AM GMT
Next Story