మళ్లీ సెట్స్ పైకి వచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్

తారక్, చరణ్ కాంబోలో భారీ మల్టీస్టారర్ సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడా సినిమాకు సంబంధించి సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. చరణ్, తారక్ హీరోలుగా ఆర్-ఆర్-ఆర్ మూవీ సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమైన విషయాన్ని యూనిట్ నిర్థారించింది.

మొదటి షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. ఈరోజు ప్రారంభమైన సెకెండ్ షెడ్యూల్ లో కూడా యాక్షన్ సన్నివేశాలే తీస్తున్నారు.

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. హీరోయిన్లు ఎవరనే విషయంపై క్లారిటీ ఇవ్వకుండానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన యూనిట్.. సెకెండ్ షెడ్యూల్ లో కూడా హీరోయిన్ల పై స్పష్టత ఇచ్చే ఉద్దేశంలో లేదు. ఒక హీరోయిన్ గా కీర్తిసురేష్ ను అనుకుంటున్నారు కానీ అది కూడా పక్కా కాలేదు.

ఈ సినిమాకు ఆర్-ఆర్-ఆర్ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. అయితే ఈ వర్కింగ్ టైటిల్ లోనే అసలు టైటిల్ కూడా దాగుందని చెబుతున్నారు. ”రామ రావణ రాజ్యం” అనే టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.