మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో…. క్లాప్‌ కొట్టిన చిరు

మెగా ఫ్యామిలీ నుంచి మరొకరు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. సాయిధరమ్‌ తేజ సోదరుడు విష్ణుతేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రారంభమైంది. నానక్‌రామ్ గూడలోని రామనాయుడు స్టూడియోలో సినిమా ప్రారంభోత్సవం జరిగింది. చిరంజీవి కుటుంబసభ్యుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు.

దర్శకుడు సుకుమార్‌ వద్ద పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. చిరంజీవి క్లాప్‌ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

వచ్చిన చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని విష్ణుతేజ్ పైకి ఎదగాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఈ చిత్రం కథను చిరంజీవి నాలుగు సార్లు విన్నారని… ఒక్కోసారి నాలుగు గంటలపాటు సమయం కేటాయించి కథ వినడంతోపాటు పలు సూచనలు చేశారని దర్శకుడు సుకుమార్‌ వివరించారు.