ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పద్మశ్రీ పై దాడి…

ఏపీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పై టీడీపీ నేతలు దాడి చేశారు. రాత్రి గన్నవరంలో ఒక అంశంపై స్థానికులతో ఆమె మాట్లాడుతుండగా కొందరు స్థానిక నేతలు వచ్చి దాడి చేశారు.

మహిళలను కాళ్లతో తన్నారు. దీంతో సుంకర పద్మశ్రీ వెళ్లి టీడీపీ నేతల ఇళ్ల ముందే ధర్నాకు దిగారు. దాడి చేసిన టీడీపీ నేతలు కేవీప్రసాద్, అట్లూరి రామ్‌కిరణ్‌ను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న తనకే భద్రత లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.

టీడీపీ నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలన్నారు. మహిళలంటే టీడీపీ నేతలకు ఎందుకు ఇంత చులకన భావమో అర్థం కావడం లేదన్నారు.