మనోజ్ ప్రభాకర్‌ భార్యపై దాడి

మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్‌ భార్యపై దొంగలు దాడి చేశారు. బాలీవుడ్‌ నటి కూడా అయిన పర్హీన్‌ ప్రభాకర్‌పై ఢిల్లీలో దొంగలు విరుచుకుపడ్డారు. నలుగురు వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు.

షాపింగ్ మాల్‌కు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మాల్ వద్ద కారును పార్క్‌ చేసి వారితో మాట్లాడుతున్న సమయంలో దొంగలు వచ్చి ఆమె వద్దనున్న 16వేల నగదు, డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లు లాక్కుని పారిపోయారు.

రోడ్డుకు అవతలి వైపు పార్క్ చేసిన కారులో నలుగురు దొంగలు పారిపోయినట్టు పోలీసులకు ఆమె వివరించారు. దాడితో షాక్‌కు గురైన ఆమె అక్కడే విలపించారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగలు పారిపోయిన వాహనం నెంబర్, సమీపంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.