ఐసీసీ అవార్డుల రేస్ లో కొహ్లీ వీరవిహారం

  • టెస్ట్, వన్డే ఫార్మాట్లలో బెస్ట్ క్రికెటర్ గా కొహ్లీ
  • ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ గా కొహ్లీకి సర్ గార్ ఫీల్డ్ ట్రోఫీ
  • జస్ ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ లకు ఐసీసీ అవార్డులు

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ…క్రికెట్ ఫీల్డ్ లో మాత్రమే కాదు…ఐసీసీ అవార్డులు గెలుచుకోడంలోనూ తనకుతానే సాటిగా నిలిచాడు.

క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా…ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ అవార్డుతో పాటు…ఐసీసీ వన్డే, ఐసీసీ టెస్ట్ క్రికెట్ అవార్డులకు సైతం ఎంపికయ్యాడు.

2018 సిరీస్ లో కొహ్లీ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ విశ్వరూపమే ప్రదర్శించాడు. 2018 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ మధ్య జరిగిన టెస్టులు, వన్డేల ప్రాతిపదికన ఈ అవార్డులను ప్రకటించారు.

కొహ్లీ నాయకత్వంలో ఆరు టెస్టులు నెగ్గి, ఏడు టెస్టుల్లో ఓటమి పొందిన టీమిండియా…వన్డేలలో 9 విజయాలు, 4 పరాజయాలు చవిచూసింది.

ఓ మ్యాచ్ ను టైగా ముగించింది. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కింద కొహ్లీకి…సర్ గార్ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని వరుసగా రెండో ఏడాది… ఐసీసీ బహుకరించనుంది.

టీమిండియా స్టార్ బౌలర్లు కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా సైతం ఐసీసీ అవార్డులకు ఎంపికయ్యారు.