కామన్‌సెన్స్ లేదు – మీడియాపై కేటీఆర్‌ ఘాటు విమర్శ

లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పాటు, ప్రధాని కావాలన్న కోరికతోనే కేసీఆర్‌ యాగం చేస్తున్నారని ఒక ఆంగ్ల దిన పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు.

కొన్ని మీడియా సంస్థలకు కామన్‌సెన్స్ లేకుండా పోయిందన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండానే వార్తలు ప్రచురిస్తున్నారని విమర్శించారు.

ఇలాంటి వార్తలను పబ్లిష్ చేస్తున్న ఎడిటర్ల విజ్ఞతకే వాటిని వదిలేస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు. మీడియా సంస్థలు వార్తలను ప్రచురించేటప్పుడు కామన్‌సెన్స్‌తో ఆలోచించాలని హితవు పలికారు.