Telugu Global
National

యాన్యుటీ పద్ధతిలో తాగునీరు.... స్కూళ్ళ నిర్మాణానికి "మేఘా" ముందంజ

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వాముల కలయికతో రూపొందించే పథకమే ‘యాన్యుటీ’. ప్రజలకు అవసరం అనుకున్న ప్రాజెక్టులను నిర్మించాల్సినప్పుడు ప్రభుత్వం దగ్గర తగినంత నిధులు లేనప్పుడు ప్రైవేట్ కంపెనీలే పెట్టుబడిని పెట్టి, ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన తర్వాత ప్రతి సంవత్సరం దశల వారీగా పెట్టుబడిని ప్రభుత్వం నుంచి తిరిగి పొందడమే యాన్యుటి ప్రాజెక్టు విధానం. ఈ ప్రాజెక్టులను ఇంతకు ముందు రహదారులు, మౌలిక సదుపాయాల రంగాలలో మాత్రమే చేసేవారు. కానీ మేఘా ఇంజనీరింగ్ దేశ వ్యాప్తంగా తొలిసారిగా తాగు […]

యాన్యుటీ పద్ధతిలో తాగునీరు.... స్కూళ్ళ నిర్మాణానికి మేఘా ముందంజ
X

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వాముల కలయికతో రూపొందించే పథకమే ‘యాన్యుటీ’. ప్రజలకు అవసరం అనుకున్న ప్రాజెక్టులను నిర్మించాల్సినప్పుడు ప్రభుత్వం దగ్గర తగినంత నిధులు లేనప్పుడు ప్రైవేట్ కంపెనీలే పెట్టుబడిని పెట్టి, ఆ ప్రాజెక్ట్‌ పూర్తి చేసిన తర్వాత ప్రతి సంవత్సరం దశల వారీగా పెట్టుబడిని ప్రభుత్వం నుంచి తిరిగి పొందడమే యాన్యుటి ప్రాజెక్టు విధానం.

ఈ ప్రాజెక్టులను ఇంతకు ముందు రహదారులు, మౌలిక సదుపాయాల రంగాలలో మాత్రమే చేసేవారు. కానీ మేఘా ఇంజనీరింగ్ దేశ వ్యాప్తంగా తొలిసారిగా తాగు నీరు, విద్యా రంగాలలో మౌలిక సదుపాయాల కల్పన కింద 5 ప్రాజెక్టులను యాన్యుటీ మోడల్‌లో చేపట్టింది. ఇందుకోసం మేఘా మొత్తం 6000 కోట్ల రూపాయలను సొంతంగా వ్యయం చేయనుంది. యాన్యుటీ మోడల్ వివిధ రంగాలలో విఫలమైన తరువాత తాగునీటి రంగంలో ఈ విధానంలో పనులు చేపట్టేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రాని పరిస్థితుల్లో మేఘా ధైర్యంగా ముందడుగు వేసింది.

తెలంగాణలోని కేశవాపూర్ రిజర్వాయర్ (హైదరాబాద్), హైదరాబాద్ నగర శివారులోని ఓఆర్ఆర్ పరిసరాల్లోని 190 గ్రామాలకు, 5 నగర పంచాయితీలకు తాగునీరు అందించే ప్రాజెక్టులను, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని 2426 పాఠశాలల నిర్మాణం, ఓడిషా రాజధాని భువనేశ్వర్ లో బల్క్ తాగునీటి ప్రాజెక్టులను మేఘా యాన్యుటీ మోడల్ క్రింద చేపట్టింది.

4396 కోట్ల రూపాయలతో కేశవాపూర్ రిజర్వాయర్

హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీర్చేందుకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ క్రింద 4396.15 కోట్ల రూపాయలను మేఘా వెచ్చిస్తోంది. శామీర్ పేట మండలం కేశవాపూర్ వద్ద 10 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రిజర్వాయర్‌ తో పాటు శామీర్ పేట పరిసర గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు 750 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు నిర్మిస్తున్నారు.

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ క్రింద ప్రభుత్వం 20 శాతాన్ని సమకూరిస్తే మేఘా 80 శాతాన్ని ఖర్చు చేయనుంది. ఈ 80 శాతాన్ని నిర్వహణ సమయంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. 36 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉండగా…. “మేఘా” ఇంజనీరింగ్ త్వరలో పనులు చేపట్టనుంది. యాన్యుటీ పద్ధతిలో మాత్రం మొత్తం వ్యయాన్ని సంస్థ భరించాలి. ప్రభుత్వం ఎటువంటి మొత్తాన్ని సమకూర్చదు.

నగర శివారులోకి మేఘా తాగునీరు

628 కోట్ల ఖర్చుతో “మేఘా” ఇంజనీరింగ్ హైదరాబాద్ నగర శివారు పరిధిలోని 190 గ్రామాలకు తాగునీరు అందించేందుకు యాన్యుటీ మోడల్లో ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తుంది. పని పూర్తయ్యాక రాబోయే ఏడేళ్ళ కాలంలో ఈ మొత్తాన్ని మేఘా తిరిగి ప్రభుత్వం నుండి పొందనుంది.

నగర పంచాయతీలకు తాగునీటి సరఫరా

మిషన్ భగీరథ (అర్బన్) పథకంలో భాగంగా తెలంగాణలోని వివిధ జిల్లాలలోని నగర పంచాయతీలైన హుస్నాబాద్, ఆంధోల్, జోగిపేట, హుజూర్ నగర్, కోదాడ, దేవరకొండలకు తాగునీరు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును “మేఘా” ఇంజనీరింగ్ సంస్థ యాన్యుటీ విధానంలో చేపట్టింది. ఇందుకోసం మేఘా రూ.163.85 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మొత్తాన్ని ఏడు సంవత్సరాల కాలంలో ఏడాదికి కొంత మొత్తం చొప్పున ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఈ పథకాన్ని 15 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.

యాన్యుటీలో మేఘా పాఠశాలల నిర్మాణం

సర్వశిక్ష అభియాన్ పథకం క్రింద ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని 46 మండలాలకు చెందిన 1378 ప్రభుత్వ పాఠశాలలు, ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లోని 1048 ప్రభుత్వ పాఠశాలలను మేఘా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో నిర్మిస్తున్నది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ. 589.72 కోట్లు కాగా, ఇందులో 60 శాతం నిధులను మేఘా సమకూరుస్తున్నది. ఐదేళ్లపాటు ఈ ప్రాజెక్టును మేఘా నిర్వహిస్తుంది.

భువనేశ్వర్‌లో బల్క్ వాటర్ ప్రాజెక్ట్‌

2017లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా మేఘా ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీ భువనేశ్వర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చి, పారిశ్రామిక పార్కులతో పాటు భువనేశ్వర్ పరిసర మున్సిపాలిటీలైన ఖోర్దా, జాట్నాలకు తాగునీరు అందిస్తోంది. ఇందుకుగానూ మేఘా ఇంజనీరింగ్ 187 కోట్లను యాన్యుటీ విధానంలో ఖర్చు చేస్తుంది. 25 ఏళ్ళ పాటు నిర్వహణ బాధ్యతలు కూడా మేఘా ఇంజనీరింగ్ చేపడుతుంది.

First Published:  22 Jan 2019 12:50 AM GMT
Next Story