ఈ హాట్ బ్యూటీ తమ్ముడు తప్పిపోయాడట

“RX 100” లాంటి హాట్ సినిమాలో నటించి…. అటు గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా తరువాత ఈ భామకి రవితేజ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. “డిస్కో రాజా” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఇదిలా ఉంటే పాయల్ రాజ్ పుత్ జీవితంలో ఒక పెద్ద విషాదం ఉందట. అవును తన జీవితంలో జరిగిన ఈ విషాదం గురించి పాయల్ రాజ్ పుతే స్వయంగా చెప్పుకొచ్చింది.

పాయల్ రాజ్ పుత్ దీని గురించి తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్టు పెట్టారు.  తన సోదరుడు అయిన ధృవ్ గత కొన్నేళ్ళుగా కనిపించడం లేదు అని చెప్పుకొచ్చింది. 25 ఏళ్ళ ధృవ్ 2016 మార్చ్ 27 నుంచి కనిపించడం లేదు. ముంబై అంధేరీవెస్ట్ లోఖండ్ వాలా బ్యాక్ రోడ్ లో చివరిగా ఒకసారి చూశానని పాయల్ రాజ్ పుత్ తెలిపింది.

ధృవ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ హ్యాపీ బర్త్ డే భాయ్. ఈ మెస్సేజ్ నువ్వు చూడాలనుకుంటున్నా. నీ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం.  నీకోసం  ముంబై పోలీస్ స్టేషన్‌లో ఎన్నో సార్లు ఫిర్యాదు చేశాం. అయినా నీ జాడ లేదు. నువ్వు వస్తావని ఆశగా ఎదురు చూస్తున్నాం అని #FindDhruv అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన సందేశాన్ని పోస్ట్ చేశారు పాయల్. మరి సోషల్ మీడియా జనాలు ధృవ్ ని పట్టుకొని పాయల్ రాజ్ పుత్ చెంతకు చేరుస్తారో లేదో చూడాలి.